ప్రభాస్ రాజా డీలక్స్ సినిమాపై ఇంట్రెస్టింగ్ రూమర్స్..!!

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో డైరెక్టర్ మారుతి కూడా ఒకరిని చెప్పవచ్చు. ఎప్పుడూ కూడా కామెడీ జోన్లలో ప్రేక్షకులను నవ్వించే సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు మారుతి. ఈ డైరెక్టర్ ఇప్పుడు తాజాగా ప్రభాస్ తో కలిసి ఒక సినిమాని ప్రకటించడం జరిగింది. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి విషయాలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి.ముఖ్యంగా యూనిట్ సభ్యుల నుంచి లీక్ రూపంలో పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభాస్ ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారని ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి.

What we know so far about Prabhas-Maruthi project - Telugu News -  IndiaGlitz.comతాజాగా ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రల గురించి ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారుతోంది. ప్రభాస్ సెకండ్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని ఈ పాత్ర ఇంటర్వెల్ ముందు వస్తుందని రెండవ ప్రభాస్ ఎంట్రీ సీన్ ఈ సినిమాకు చాలా హైలైట్ గా నిలుస్తుందనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్లు రాజా డీలక్స్ అంటూ టైటిల్ ని ప్రచారం చేయడం కూడా జరిగింది.కానీ పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదల చేస్తున్న నేపథ్యంలో టైటిల్ మారిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు.

ప్రభాస్ ఇప్పటివరకు టచ్ చేయని ఒక విభిన్నమైన కమర్షియల్ థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా ఉండబోతుందని ముగ్గురు హీరోయిన్లు ఇందులో నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో డైరెక్టర్ మారితే తెరకెక్కించిన ఎన్నో కామెడీ హర్రర్ చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఖాయమని తెలియజేస్తున్నారు.