2022వ సంవత్సరం త్వరలోనే ముగిసిపోనుంది. ఈ ఏడాదిలో బింబిసార, కార్తికేయ 2, సీతా రామం, కార్తికేయ 2 సినిమాలు విడుదలై అత్యధిక లాభాలను సంపాదించాయి. ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే తక్కువ బడ్జెట్‌తో రూపొంది ఎక్కువ లాభాలు పొందిన తెలుగు సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటితోపాటు ఈ ఏడాది ఎక్కువ లాభాలను పొందిన సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తికేయ 2
స్వామి రారా సేమ్ నిఖిల్ విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ లాభాలను తీసుకొస్తున్నాడు. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన అతని సినిమా కార్తికేయ 2 మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ సైడ్ కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఈ సినిమా రూ.12.8 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటి వరకు రూ.58.40 కోట్ల షేర్ (రూ. 121.50 కోట్ల గ్రాస్ ) వసూళ్లను చేసి ఓవరాల్‌గా నిర్మాతలకు రూ.45.10 కోట్ల ప్రాఫిట్‌ను తెచ్చి పెట్టింది.
ఉప్పెన
మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ఉప్పెన సృష్టించింది. హీరోయిన్ కృతి శెట్టి ఈ సినిమాలో బీభత్సంగా అందాలు ఆరబోసింది. అలాగే ‘జలజల జలపాతం నువ్వు’ అంటూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేసింది. తక్కువ అంచనాలు నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ ఎవరూ ఊహించని స్థాయిలో రూ.51 కోట్ల షేర్ వసూలు చేసింది. ఉప్పెన రూ.20.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి నిర్మాతలకు టోటల్‌గా రూ. 31.02 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది.
గీత గోవిందం
విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ డీసెంట్ రొమాంటిక్ కథతో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా రూ.70 కోట్ల షేర్స్ కొల్లగొట్టింది. మొత్తం మీద రూ.55.43 కోట్ల ప్రాఫిట్‌ను అందించింది.
ఫిదా
భానుమతి హైబ్రిడ్ పిల్ల అంటూ సాయి పల్లవి వంటి చేత్తో ఫిదా సినిమాని హిట్ చేసిన విషయం తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా ఈ సినిమా రూ. 50 కోట్ల షేర్ సాధించి.. రూ. 30.5 కోట్ల ప్రాఫిట్స్ అందించింది.
సీతారామం
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ స్టారర్ ‘సీతారామం’ కూడా తక్కువ డబ్బులతో రూపొంది రూ.16.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా సుమారు రూ. 46.50 కోట్ల షేర్ (రూ. 98.10 కోట్ల గ్రాస్) రాబట్టి రూ. 29.50 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
జాతి రత్నాలు
జాతి రత్నాలు మూవీ రూ. 11 కోట్ల ప్రీ రిలీజ్ చేసి.. మొత్తం మీద రూ. 39 కోట్ల షేర్ రాబట్టి ఓవరాల్‌గా రూ. 27.52 కోట్ల ప్రాఫిట్ అందించింది.