ఈ వయసులో అలాంటి సాహసం.. “ది ఘోస్ట్ ” సినిమా కోసం బిగ్గెస్ట్ తప్పు చేసిన నాగార్జున..!!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోల కన్నా సీనియర్ హీరోలే జోరుగా సినిమాలకు సైన్ చేస్తూ.. కమిటీ అయిన సినిమాను త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి జనాల ముందుకు తీసుకొస్తున్నారు . ఆ వరుసలో టాప్ ప్లేస్ లో ఉన్నారు టాలీవుడ్ హీరోస్ చిరంజీవి-నాగార్జున-బాలకృష్ణ. కాగా నేడు దసరా సందర్భంగా బాక్సాఫీస్ వద్ద టఫ్ ఫైట్ ఇచ్చుకున్నారు చిరంజీవి-నాగార్జున. మనకు తెలిసిందే చిరంజీవి కెరీర్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది . అంతేకాదు ఈ సినిమాకి కాంపిటీషన్ గా అక్కినేని నాగార్జున కూడా కెరియర్ లోనే ఫస్ట్ టైం ఫుల్ లెంత్ యాక్షన్ సినిమాలో నటించిన “ది ఘోస్ట్” దసరా కానుక థియేటర్లో రిలీజ్ చేశారు . ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నువ్వా-నేనా అంటూ పోటీపడి మరి పాజిటివ్ టాక్స్ ను సంపాదించుకుంటున్నాయి.

కాగా అక్కినేని నాగార్జున హీరోగా నటించిన “ది ఘోస్ట్ ” మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అంతేకాదు కెరియర్ లోనే ఫస్ట్ టైం నాగార్జున ఇలా ఫుల్ లెంత్ యాక్షన్ సీన్స్ లో నటించడం సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది . అంతేకాదు సోనాలి చౌహాన్ తో చేసిన రొమాంటిక్ సీన్స్ కూడా నాగార్జున అభిమానులను మెప్పిస్తున్నాయి. అయితే ఈ వయసులో ఇలాంటి సీన్స్ లో నటించడం కొంచెం సాహసమనే చెప్పాలి. మిగతా హీరోలతో కంపేర్ చేస్తే నాగార్జున ఈ విషయంలో కొంచెం ఎక్కువగానే ఫోకస్ చేస్తున్నాడు. చిరంజీవి, బాలకృష్ణ , వెంకటేష్ ఇలాంటి వయసులో ఈ రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి ఒప్పుకోరు. అయితే నాగార్జున మాత్రం సోనాలి చౌహాన్ తో బోట్ లో చేసిన రొమాన్స్ .. థియేటర్స్ లో చూసిన జనాలకు కొత్త ఊపునిస్తుంది.

దీంతో కొందరు జనాలు ఈ వయసులో ఇలాంటి పనులు అవసరమా అంటూ కూడా నాగార్జునను ట్రోల్ చేస్తున్నారు. అయితే ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో తెరకెక్కిన “ది ఘోస్ట్ ” సినిమా కోసం నాగార్జున ఫిట్ ఆఫీసర్గా కనిపించడానికి రెండు నెలలు ప్లాంట్ బేస్డ్ డైట్ ను ఫాలో అయ్యారట. ఇదే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో షాకింగ్ గా మారింది. మనకు తెలిసిందే నాగార్జున వయసు ఎంత పెరిగిన కానీ చూడడానికి చాలా హ్యాండ్ సమ్ గా ఫిట్ గా ఉంటారు .

అయితే ప్రత్యేకంగా ఈ సినిమా కోసం ఓ డైటీషియన్ అపాయింట్ చేసుకొని టూ మంత్స్ వాటర్ బేస్డ్ డైట్, ప్లాంట్ బేస్డ్ డైట్ ను కంటిన్యూగా ఫాలో అయ్యారట. ఈ క్రమంలోనే బాడీలో ఆయన చాలా మార్పులు గమనించారని తెలుస్తుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .అయితే ఇది నిజానికి చాలా ప్రమాదకరమని అంటున్నారు డాక్టర్స్. ఇలాంటి వయసులో నాగార్జున ప్లాన్ బేస్డ్ డైట్ , వాటర్ బేస్డ్ డైట్.. వన్ వీక్ -టు వీక్స్ చేయాలి.. మరీ ఇలా రెండు మూడు నెలలు కంటిన్యూగా చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరం అంటూ హెచ్చరిస్తున్నారు . ఇలాంటి పనులు మరోసారి నాగార్జున చేయకుండా ఉంటేనే బెస్ట్ అంటూ సజీషన్స్ ఇస్తున్నారు. దీంతో “ది ఘోస్ట్ ” సినిమా సక్సెస్ అయినా కాని నాగార్జునకు ఆరోగ్య భయం పట్టుకుంది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది . చూడాలి మరి “ది ఘోస్ట్ ” సినిమా ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో..?