పవన్, దేవిశ్రీ కాంబినేషన్లో అన్నీ సూపర్ హిట్ మ్యూజిక్లే. అందుకే పవన్ కోసం దేవి మరో సూపర్ హిట్ మ్యూజిక్‌ని ప్లాన్ చేస్తున్నాడట. అది పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ‘కాటమరాయుడు’ సినిమా కోసం. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే దేవిశ్రీ ప్రసాద్, అనూప్‌కి కొన్ని ఇన్పుట్స్ ఇస్తున్నాడట ఈ సినిమా మ్యూజిక్ విషయంలో. అంతే కాదు పవన్ కోసం ఒక మాంచి మసాలా సాంగ్‌ని కూడా దేవి ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారమ్. ఈ సినిమాలో ఒకటి లేదా రెండు సాంగ్స్‌కి దేవి మ్యూజిక్ అందించే అవకాశాలున్నాయట.
డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హుందాతనం ఉట్టిపడే క్యారెక్టర్లో కనిపించనున్నాడు. నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా నటిస్తున్నారు. సినిమా మొత్తం పవన్ పంచకట్టుతో కనిపించడం మరో విశేషం. ‘గబ్బర్‌సింగ్’లో పవన్‌తో నటించిన శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా రెండోసారి పవన్‌తో జత కడుతోంది. పవన్ తమ్ముళ్లలో ‘పెళ్లిచూపులు’ ఫేం విజయ్ దేవరకొండ, కమల్ కామరాజు ఎంపిక అయ్యారు మిగతా ఆర్టిస్టులు పరిశీలనలో ఉన్నారు. పవన్‌కి అత్యంత సన్నిహితుడైన శరత్‌మరార్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.