పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి తొలిసారి కలిసి నటించిన తాజా చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
మలయాళంలో సూపర్‌గా నిలిచిన `అయ్యప్పనుమ్ కోషియుమ్`కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ భీమ్ల నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, రానా డేనియర్ శేఖర్ అనే రిటైర్డ్ ఆర్మీ అధికారిగా కనిపించబోతున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కావాల్సి ఉంది.
కానీ, ఆర్ఆర్ఆర్ సినిమా కారణంగా భీమ్లానాయక్ చిత్రాన్ని ఫిబ్రవరి 25కు వాయిదా వేశారు. ఈ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. దీంతో అటు పవన్, ఇటు రానా ఫ్యాన్స్ ఎంతగానో ఫీల్ అవుతున్నారు. అయితే ఇలాంటి తరుణంలో భీమ్లా నాయక్ వాయిదాపై మెగా డాటర్ నిహారిక చేసిన కామెంట్స్ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
తాజాగా నిహారిక మాట్లాడుతూ..`భీమ్లానాయక్ సూపర్ హిట్ అవుతుందని అన్నారు. మా బాబాయ్ ఓ సినిమాలో చెప్పినట్టు.. “రావడం కాస్త లేటు అవ్వొచ్చు. కానీ రావడం మాత్రం పక్కా“ అదే మాదిరిగా సినిమా విడుదల కాస్త ఆలస్యం కావొచ్చు. కానీ బాక్సాఫీస్ బద్దలు కొట్టడం మాత్రం పక్కా` అని చెప్పుకొచ్చింది. దీంతో నిహారిక వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారగా.. పవన్ ఫ్యాన్స్ `కరెక్ట్, సూపర్` అంటూ కామెంట్స్ చేస్తున్నారు.