ఏపీ లో సినిమా టిక్కెట్ల ధర పై RRR యూనిట్ సభ్యులు సంచలన వ్యాఖ్యలు.!!

గత కొన్ని నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలకు సంబంధించి ఒక పెద్ద మిస్టరీ నే నడుస్తూ ఉంది. అయితే అనూహ్యంగా తగ్గించిన టికెట్ ధరలతో టాలీవుడ్ కి పెద్ద దెబ్బ తగిలేలా ఉంది. గత కొద్దిరోజుల ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలతో ఇప్పట్లో ఈ సినిమా టిక్కెట్ల ధరల అంశం సర్దుమణిగేలా కనిపించలేదు.

ఇక ఇదే పద్ధతి కంటిన్యూ అయితే.. అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమాలకు తీవ్ర నష్టం తప్పదు. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం గానే తెలుగు ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా మార్కెట్ కి వెళ్తున్న భారీ చిత్రం. RRR యూనిట్ కీలక చర్చలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం.

ఈ చిత్ర నిర్మాణ సంస్థ డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ విషయాన్ని వెల్లడించారు. టికెట్ ధరలు తగ్గించడం మూలాన సినిమా పరిశ్రమ నష్టపోతుంది. అనే మాట వాస్తవం. అయితే మేము ఈ సమస్యపై కోర్టు దగ్గరకు వెళ్లాలని అనుకోలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తోనే మాట్లాడి పరిష్కరించుకోవాలి అనుకుంటున్నాము అని వారు తెలియజేశారు.