బిగ్‌బాస్‌5: తారా స్థాయికి శ్రీ‌రామ్‌ గ్రాఫ్‌..బ‌రిలోకి దిగిన స‌జ్జ‌నార్!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ప‌దో వారం కూడా పూర్తి కాబోతోంది. మొత్తం 19 మందితో ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌లు వ‌రుస‌గా ఎలిమినేట్ కాగా.. ఇంకా ప‌ది మందే మిగిలి ఉన్నారు.

బిగ్ బాస్ సీజన్ 5: నాలుగవ కంటెస్టెంట్ గా ఇండియన్ ఐడల్ విన్నర్, సింగర్, యాక్టర్ శ్రీరామ చంద్ర | bigg boss season 5 singer sriram chandra enters bigg boss house as fourth contestant

అయితే వీరిలో సింగ‌ర్ శ్రీ‌రామ‌చంద్ర గ్రాఫ్ రోజురోజుకు తారా స్థాయికి చేరుకుంటోంది. శ్రీ‌రామ్‌ను విన్న‌ర్ చేసేందుకు ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు, అభిమానులే కాకుండా సెల‌బ్రెటీలు సైతం తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. ఇప్ప‌టికే పాయ‌ల్ రాజ్ పూత్‌, సోనూసోద్‌, హిందీ కమెడియన్ భారతీ సింగ్ త‌దిత‌రులు శ్రీ‌రామ్‌కి స‌పోర్ట్‌గా నిల‌వ‌గా.. ఇప్పుడు ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ బ‌రిలోకి దిగారు.

Sreerama Chandra on Twitter: "Mr cool ? and Mr clear ? #BiggBossTelugu5 #SreeramaChandra #SRCBB5 ~#TeamSreeramaChandra https://t.co/7lm64ZG5ys" / Twitter

తాజాగా ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ప్ర‌త్యేక వీడియో ద్వారా శ్రీరామ్‌ అద్భుతంగా గేమ్ ఆడుతున్నాడ‌ని, పాట‌లు కూడా బాగా పాడుతున్నాడ‌ని, ఆయ‌న బిగ్ బాస్ 5 టైటిల్ గెలుస్తాడ‌నే న‌మ్మకం ఉంద‌ని తెలియ‌జేశారు. దీంతో ఇప్పుడాయ‌న వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

https://twitter.com/Sreeram_singer/status/1459549866053582851?s=20