టాలీవుడ్ లో పెళ్లి కథలకు మళ్ళీ గిరాకీ?

అప్పట్లో సినిమాల నుంచి ఇప్పటి సినిమాల వరకూ సినిమాల్లో ప్రేమ అనేది ప్రధాన అంశంగా ఉంది. ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో పెళ్లి నేపథ్యంలో సినిమాలు వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకున్న సినిమా వివాహ భోజనంబు. ఇందులో కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటించాడు.

కరోనా అంశాలను అధిగమించి ఇద్దరూ ప్రేమికులు ఎలా పెళ్లి పీటలు ఎక్కారు, వరుడు పిసినారి అయితే ఆడపెళ్ళి వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే అంశంతో ఈ సినిమా రూపొందింది. ఇటీవలే రిలీజ్ అయినా పెళ్లి సందడి. రోహన్,శ్రీ లీల జంటగా నటించారు. అలాగే మూడు పెళ్లిళ్ల తో ఒక అమాయకుడి జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం బట్టల రామస్వామి బయోపిక్.

అలాగే పెద్దల ఒత్తిడితో ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్న యువకుడు ఆమెతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్న అంశంతో తెరకెక్కిన చిత్రం రంగ్‌ దే. ఇందులో కీర్తి సురేష్, నితిన్ నటించారు. ఇటీవల విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. సినిమాలో అఖిల్, నటించారు.పెళ్లి విషయంలో వేర్వేరు అభిప్రాయాలు బలంగా ఉన్నా ఇద్దరు వ్యక్తుల మనసు ఎలా కలిసాయి అనేది కథ. అలాగే రీతువర్మ, నాగసౌర్య జంటగా నటించిన తాజా చిత్రం వరుడు కావలెను.ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం సినిమా. పెళ్ళయిన కొన్ని రోజులకే భార్య తన భర్తను వదిలేసి వేరే వ్యక్తితో వెళ్లి పోతే అప్పుడు భర్త పరిస్థితి ఏంటి? అన్న కతే పుష్పక విమానం.