కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుకు గురయ్యారు. దాంతో వెంటనే ఆయన్ను కుటుంబసభ్యులు హాస్పటల్‌కి తరలించారు. బెంగుళూరులోని విక్రమ్ హాస్పటల్లో అడ్మిట్ అయిన పునీత్ రాజ్ కుమార్‌కు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు.
ఇప్పటికే ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ను ఇస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, జిమ్ లో వ్యాయమం చేస్తున్న నేపథ్యంలో పునీత్ రాజ్ కుమార్‌కి గుండెపోటు వచ్చి నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
#JUSTIN: Kannada superstar @PuneethRajkumar has been admitted to a private hospital in #Bengaluru after he had a mild heart attack while working out in the gym. @IndianExpress pic.twitter.com/Ft0IEc2jZO
— Darshan Devaiah B P (@DarshanDevaiahB) October 29, 2021