న‌క్క తోక తొక్కిన శ్రీ‌లీల‌..ఎన్టీఆర్ మూవీలో బంప‌ర్ ఆఫ‌ర్..?

మొద‌టి సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లు చాలా అరుదు. అయితే ఈ లిస్ట్‌లో తాజాగా చేరింది అందాల భామ శ్రీ‌లీల. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెర‌కెక్కిన `పెళ్లి సంద‌D` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ‌లీల‌.. ఫ‌స్ట్ మూవీతోనే కుర్రాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసింది.

Bridal makeup hot photos | Sreeleela looking very glamorous photos Photos: HD Images, Pictures, Stills, First Look Posters of Bridal makeup hot photos | Sreeleela looking very glamorous photos Movie - Mallurepost.com

పెళ్లి సంద‌D టాక్ సంగతి, వసూళ్ల సంగతి ప‌క్క‌న పెడితే.. హీరోయిన్ శ్రీ‌లీల మాత్రం మ‌స్తు పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం ఈ భామ‌కు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే ర‌వితేజ ధ‌మ‌కా స‌హా నాలుగైదు ప్రాజెక్ట్‌ల‌ను చేతిలో ఉంచుకున్న‌ శ్రీ‌లీల.. తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌ను కొట్టేసింద‌ట‌.

NTR - Koratala Siva Combo: NTR30 Changes Hand For Pan-India Appeal?

లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌- కొర‌టాల శివ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌బోతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో సెకెండ్ హీరోయిన్‌గా శ్రీ‌లీల‌ను ఎంపిక చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌వేళ ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే.. శ్రీ‌లీల న‌క్క తోక‌ తొక్కిన‌ట్టే అవుతుంది.