అఖిల్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా వచ్చిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ వహించాడు. ఇక ఈ సినిమా అక్టోబర్ 15 వ తేదీన దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా.. అందరి ప్రశంసలు అందుకుంది. హీరోగా ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక్క హిట్టు కూడా పడలేదు. దీంతో మొదటిసారిగా ఫస్ట్ టైం హిట్ కొట్టాడు అనే వార్త కూడా వినిపిస్తోంది.
అయితే తాజాగా ఈ సినిమాపై మెగా స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపించాడు. రామ్ చరణ్ సినిమా చూసి”నా సోదరుడు అఖిల్ ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అని చెప్పుకొచ్చాడు.”ఇక హీరోయిన్ పూజా అయితే తన నటనతో మాయ చేసింది అని చెప్పుకొచ్చాడు. ఇక గీత ఆర్ట్స్ బ్యానర్ పై మరొకసారి ఫ్యామిలీ డ్రామాతో ఈ సినిమానే తెరకెక్కించారని అని ప్రశంసలు వర్షం కురిపించాడు రామ్ చరణ్. దీంతో ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారుతుంది.
So happy for my brother @AkhilAkkineni8 on the success of #MostEligibleBachelor 🤗
Loved your performance in this film. @hegdepooja you nailed it again👏👍
Many congratulations to @GA2Official & Bhaskar
We thoroughly enjoyed it 👍 pic.twitter.com/rEMXJR7Z51— Ram Charan (@AlwaysRamCharan) October 19, 2021