రెబల్ స్టార్ ప్రభాస్, శ్రుతి హాసన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `సలార్`. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రాన్ని ఏప్రిల్ 14, 2022న విడుదలవుతుందని ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్ర పోషించబోతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలను సలార్ యూనిట్ నిజం చేసింది. ఈ చిత్రంలో `రాజమనార్` అనే పవర్ ఫుల్ పాత్రలో జగ్గుభాయ్ కనిపించబోతున్నారు.
తాజాగా మేకర్స్ రాజమనార్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో జగపతిబాబు ఎంతో భయకరంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, హంబులే ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
https://twitter.com/PrabhasRaju/status/1429670926162006021?s=20