నటసామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం వరుస పెట్టి సినిమా చేస్తున్నారు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈయన నటించిన `లవ్ స్టోరీ` చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండగా.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో `థ్యాంక్యూ` అనే మరో చిత్రం చేస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
అలాగే నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న `బంగార్రాజు` చిత్రంలో నటిస్తున్న చైతు..మరోవైపు బాలీవుడ్లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న `లాల్ సింగ్ చద్దా` సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్న నాగ చైతన్య.. మరో సక్సెస్ఫుల్ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని బలంగా ప్రచారం జరుగుతోంది.
ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు విజయ్ కనకమేడల. రెండు మూడేళ్లు సీరియల్స్‌లో, ఆ తర్వాత సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విజయ్ కనకమేడల ‘నాంది’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. మొదటి మూవీతో సూపర్ హిట్ అందుకున్న విజయ్.. ఇటీవల చైతుకు ఓ కథ చెప్పాడట. అది బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడట చేతు. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయని టాక్.