ఆ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌కి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ చైతు..త్వ‌ర‌లోనే..?

నటసామ్రాట్ నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం వ‌రుస పెట్టి సినిమా చేస్తున్నారు. ఇప్ప‌టికే శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న న‌టించిన `ల‌వ్ స్టోరీ` చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతుండ‌గా.. విక్రమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మాణంలో `థ్యాంక్యూ` అనే మ‌రో చిత్రం చేస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది.

Naga Chaitanya on what scares him most about OTT and new video formats

అలాగే నాగార్జున హీరోగా తెర‌కెక్కుతున్న `బంగార్రాజు` చిత్రంలో న‌టిస్తున్న చైతు..మ‌రోవైపు బాలీవుడ్‏లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న `లాల్ సింగ్ చద్దా` సినిమాలోనూ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఇన్ని సినిమాల‌తో బిజీగా ఉన్న నాగ చైత‌న్య‌.. మ‌రో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌కి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ని బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Vijay Kanakamedala's directorial debut 'Naandhi', starring Allari Naresh  and Varalaxmi Sarathkumar, is more than a courtroom drama - The Hindu

ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు విజయ్‌ కనకమేడల. రెండు మూడేళ్లు సీరియల్స్‌లో, ఆ తర్వాత సినిమాల్లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన విజయ్‌ కనకమేడల ‘నాంది’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. మొద‌టి మూవీతో సూప‌ర్ హిట్ అందుకున్న విజ‌య్‌.. ఇటీవ‌ల చైతుకు ఓ క‌థ చెప్పాడ‌ట‌. అది బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పాడ‌ట చేతు. ఇక త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌కు రానున్నాయ‌ని టాక్‌.