గెట్ రెడీ.. చిరు బర్త్ డేకు రానున్న అదిరిపోయే అప్డేట్..!

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న‌ మెగాస్టార్ చిరంజీవి.. త‌న 153వ చిత్రాన్ని మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో లూసిఫెర్ రీమేక్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత మెహర్ రమేష్ ద‌ర్శ‌క‌త్వంలో వేదాళం రీమేక్‌, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు చిరు. అయితే రేపు(ఆగ‌ష్టు 22) చిరు బ‌ర్త్‌డే.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న అన్ని సినిమాల నుంచీ ఏదో ఒక అప్డేట్ వ‌స్తుంద‌ని మెగా అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో లూసిఫ‌ర్ రీమేక్‌ నుంచి `బాస్ ఆఫ్ మాసెస్ మెగాస్టార్ చిరంజీవి సుప్రీం రివీల్` అంటూ ఓ అప్డేట్‌ను వదిలింది చిత్ర యూనిట్‌.

ఆగష్టు 21 సాయంత్రం 5:04 గంటలకు `సుప్రీం రివీల్` అని ప్రకటించారు. దీని బ‌ట్టీ చూస్తుంటే ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నార‌ని అర్థం అవుతోంది. కాగా, ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్వీ ప్రసాద్, ఆర్ బి చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.

Image