ఒకప్పటి హీరోయిన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పవన్ నుంచి విడిపోయిన తరువాత కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్యాలతో పూణేలో సెటిల్ అయిన రేణు.. ఈ మధ్యే హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది.
అలాగే సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. పలు టీవీ షోలకు జడ్జ్‌గా కూడా వ్యవహరిస్తోంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రేణు.. తాజాగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
కొడుకు అకీరా తన వెనకాల నిల్చొని ఉన్న సమయంలో సెల్ఫీ ఫొటో తీసుకున్న రేణు ఆ ఫొటోను అభిమానులతో పంచుకుంది. అంతేకాదు, `ఈ అద్భుతమైన వ్యక్తి నా వెనకాల ఉన్నంత వరకు నన్ను ఈ ప్రపంచంలో ఏదీ బాధించలేదు’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ పెట్టి కొడుకుపై తన ప్రేమను చాటుకుంది రేణు.