లింగుసామి మూవీకి రామ్ భారీ రెమ్యూన‌రేష‌న్?!

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంట‌గా త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుసామి ఈ చిత్రం తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. స్ఎస్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళంలో కూడా విడుద‌ల కానుంది.

ఈ చిత్రానికి ఉస్తాద్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక సోమ‌వారమే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు రామ్ పుచ్చుకుంటున్న రెమ్యూన‌రేష‌న్ ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

లేటెస్ట్ టాక్ ప్రకారం.. ఈ చిత్రానికి గానూ రామ్ ఏకంగా రూ.13 కోట్ల రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ని టాక్ న‌డుస్తోంది. ఇది ద్విభాషా చిత్రం కావడం వ‌ల్లే రామ్ అంత మొత్తం ఛార్జ్ చేస్తున్నాడ‌ని తెలుస్తోంది.