తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత ఘట్టమనేని కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఓ చిన్న నటుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. సూపర్ స్టార్‌గా ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. ఇక తన నటనతో అశేష ప్రేక్షాదరణపొందిన ఈ డైనమిక్ హీరో బర్త్‌డే నేడు.
ఈ సందర్భంగా ఆయనకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా తండ్రి కృష్ణకు స్పెషల్ విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే నాన్న, నేను ముందుకెళ్లడానికి నాకు అత్యుత్తమైన మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీకు తెలియనంతగా మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తుంటాను అని ట్వీట్ చేస్తూ తండ్రితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు మహేష్.
Happy birthday Nanna.. Thank you for always showing me the best way forward.. Love you more than you'll ever know ♥️♥️♥️ pic.twitter.com/Mm3J0OA8by
— Mahesh Babu (@urstrulyMahesh) May 30, 2021