`హ‌నుమాన్‌` కోసం లైన్‌లోకి వ‌చ్చిన‌ మెగా హీరో?!

May 31, 2021 at 7:31 am

అ!, కల్కి, జాంబి రెడ్డి.. వంటి వైవిద్య‌భ‌రిత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసి యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ త‌న నాల్గొవ చిత్రాన్ని హ‌నుమాన్ అని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇది తెలుగులో మొట్ట మొదటి ఒరిజినల్ సూపర్ హీరో సినిమా అని ప్ర‌శాంత్ తెలిప‌డంతో.. ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది.

అయితే ఈ చిత్రంలో హీరో ఎవ‌ర‌న్న‌ది మాత్రం ప్ర‌శాంత్ ఇంకా రివిల్ చేయ‌లేదు. అయితే ఈ సినిమాలో సూప‌ర్ హీరోగా న‌టించేది జాంబి రెడ్డి హీరో తేజ సజ్జ‌నే అని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. తాజా ప్ర‌చారంలో నిజం లేద‌ని, ఈ చిత్రంలో మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్నాడ‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాలంటే.. ప్ర‌శాంత్ త్వ‌ర‌గా త‌న సూప‌ర్ హీరో ఎవ‌రో ప్ర‌క‌టించాల్సిందే.

`హ‌నుమాన్‌` కోసం లైన్‌లోకి వ‌చ్చిన‌ మెగా హీరో?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts