సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సమాజంలో ట్రెండింగ్ జరుగుతున్న సంఘటనలపై మరియు సినీ, రాజకీయ ప్రముఖులపై వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలివడం వర్మకు అలవాటే.
అయితే తాజాగా అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్‌ను టార్గెట్ చూస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు వర్మ. కొన్నాళ్లుగా ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టిన అల్లు శిరీష్.. తాజాగా సిక్స్ ప్యాక్ లుక్‌లోకి తయారయ్యాడు. అంతేకాదు, అందుకు సంబంధించిన పిక్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపించారు. దీంతో ఆయన ఫొటోలు ట్రెండింగ్‌లోకి వచ్చాయి.
ఇది గమనించిన వర్మ.. అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ లుక్ షేర్ చేస్తూ తనదైన కోణంలో కామెంట్ పెట్టాడు. ఈ నా కొడుకు కెనాన్ ద బార్బేరియన్ హీరో ఆర్నాల్డ్ కొడుకు కాదు. అల్లు అరవింద్ కొడుకు. అల్లు సార్.. మీకు జోహార్ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో శిరీష్ లేటెస్ట్ లుక్ షేర్ చేశారు వర్మ. అయితే వర్మ చేసిన వ్యంగ్య కామెంట్స్‌పై అల్లు వారి అభిమానులు ఫైర్ అవుతున్నారు.
Ee Naa koduku CONAN the BARBARIAN Arnold Schwarzenegger koduku Kaadhu..Allu Aravind koduku ……Allu Saaarrr Mee ….Ki….Joharrr🙏🙏🙏 pic.twitter.com/iojyy5E9sy
— Ram Gopal Varma (@RGVzoomin) May 22, 2021