బిజినెస్ మ్యాన్‌తో ప్రియమణి ఎఫైర్..అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే?

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈ మ‌ధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ భామ‌.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇక ఈమె న‌టించిన హిందీ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్.

మనోజ్ బాజ్‌పాయ్ కీల‌క పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 2019న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‌కు సీజ‌న్ 2 రాబోతోంది. స‌మంత కీల‌క పాత్ర పోషించిన ఈ సిరీస్‌ జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే సీజ‌న్ 1లో ప్రియ‌మ‌ణి మనోజ్ బాజ్ పేయి భార్యగా సుచిత్ర పాత్రలో నటించింది.

అందులో తన ఫ్యామిలీ ఉన్నత స్థాయికి వెళ్లడం కోసం లెక్చరర్ ఉద్యోగం వదిలి స్నేహితులు ప్రారంభిస్తున్న స్టార్టప్ కంపెనీలో పార్ట్నర్ అవుతుంది ప్రియ‌మ‌ణి. ఇదే టైమ్‌లో ఆ కంపెనీ భాగస్వామితో ఆమె ఎఫైర్ పెట్టుకున్నట్లు చూపించారు. అయితే ఈ విష‌యంపై ప్రియ‌మ‌ణి తాజాగా స్పందించింది. దీని గురించి తనను చాలా మంది ప్రశ్నిస్తున్నారని, అసలు అతనితో ఎఫైర్ ఉంటుందా.. ఉండదా? అని అడుగుతున్నారని.. ఆ ట్విస్ట్ తెలియాలంటే సీజ‌న్ 2 చూడాల్సిందే అని ఫ్యామిలీ మ్యాన్ 2 పై హైప్ క్రియేట్ చేసింది.