ఆక‌ట్టుకుంటున్న `కపటనాటక సూత్రధారి` ట్రైలర్‌!

May 23, 2021 at 12:34 pm

కొత్త నటీనటులైనా మంచి కంటెంట్ ఉంటే ఆ సినిమాకు ఖ‌చ్చితంగా ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలోనే క్రాంతి సైన అనే దర్శకుడు వెరైటీ కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న‌ చిత్రం కపటనాటక సూత్రధారి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది.

విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ఫ్రెండ్స్ అడ్డా బ్యానర్‌పై మనీష్ (హలీమ్) నిర్మించారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను ప్రముఖ నిర్మాత సి అశ్వినీదత్ రిలీజ్ చేశారు.

శ్రమ బ్యాంక్‌ సిబ్బంది తమ బ్యాంక్‌లోదాచుకున్న రూ.99 కోట్ల విలువ గల బంగారాన్ని దొంగిలించారు. దీంతో వేలాది మంది రోడ్డున పడ్డారు. ఈ కేసును పోలీసులు ఎలా చేధించారనేదే క‌థ‌గా ఈ ట్రైల‌ర్‌లో చూపించారు. అత్యంత ఉత్కంఠ భరితంగా, క్యూరియాసిటీని పెంచేవిధంగా ఉన్న ఈ ట్రైల‌ర్ సినిమా అంచ‌నాల‌ను పెంచేసింది.

ఆక‌ట్టుకుంటున్న `కపటనాటక సూత్రధారి` ట్రైలర్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts