చరణ్ ” పెద్ది ” ఫస్ట్ సింగిల్ చిక్కిరిచికిరి వచ్చేసిందోచ్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా.. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందుతుంది. శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు మేరవనున్నారు. ఇక ఈ సినిమా అర్బన్ స్పోర్ట్స్ బాక్‌ డ్రాప్‌లో.. మాస్ యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కనుంది. ఈ క్ర‌మంలోనే.. సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, పోస్టర్ లుక్స్‌ ఆడియన్స్‌లో అదిరిపోయే రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి.

Chikiri Chikiri Song Promo (Telugu) | Peddi | Ramcharan | Janhvi | Buchi Babu Sana | AR Rahman - YouTube

ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పాయి. ఇక.. సినిమాను వచ్చే ఎడాది చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా 2026 మార్చి 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మెల్లమెల్లగా ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. కొద్దిరోజుల క్రితం సినిమా నుంచి చిక్కిరి ప్రోమో రిలీజ్ చేసి అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకున్నారు. ఇక చిక్కిరి అంటే.. మేకప్ లేకపోయినా అందంగా ఉండే అమ్మాయి అని అర్థం అంటూ గతంలో బుచ్చి బాబు క్లారిటీ ఇచ్చాడు.

Get Ready To GROOVE! Ram Charan And Janhvi Kapoor's 'Chikiri' From Peddi Is Taking Over The Internet! | Glamsham.com | Since 1999

ఇక ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ అయిన దగ్గర నుంచి.. ఫుల్ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్‌. ఎట్టకేలకు ఆ టైం వచ్చేసింది. కొద్దిసేపటి క్రితం మూవీ టీం ఫస్ట్ సింగిల్.. ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్లో చరణ్ మాస్టెప్స్ జాన్వి కపూర్ అందాలు ఆడియన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే సాంగ్ చూసిన ఆడియన్స్ సైతం.. పాజిటివ్ రివ్యూస్ అందజేస్తున్నారు. మీరు కూడా ఓ లుక్ వేసేయండి.