సినీ ఇండస్ట్రీలో ఓ హీరోని అనుకొని డైరెక్టర్లు కథ రాయడ్.. తర్వాత కొంతమంది హీరోలు వద్దని ఆ స్టోరీలు వదిలేయడంతో అదే కథలో మరో హీరో నటించి బ్లాక్ బస్టర్ కొట్టడం లాంటివి ఎన్నో సందర్భాల్లో కామన్ గానే జరుగుతూ ఉంటాయి. అలా గతంలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ కూడా ఒక కథను రిజెక్ట్ చేశారట. అదే కథను టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ మూవీ మరేదో కాదు రవితేజ కెరీర్‌లోనే ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిన భద్ర. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా కోసం.. మొదట అల్లు అర్జున్‌ను హీరోగా భావించాడట బోయపాటి.
అల్లు అర్జున్ అప్పుడే హీరోగా కెరీర్ ప్రారంభించి గంగోత్రి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. మొదటి సక్సెస్ తర్వాత ఆయనకు వరుస అవకాశాలు దక్కాయి. ఈ క్రమంలోనే భద్ర కథ కూడా అల్లు అర్జున్ కు వినిపించాడట బోయపాటి. కానీ.. అప్పటికే బన్నీ మరో ప్రాజెక్టులో బిజీగా ఉండడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. ఇక ఈ కథను ఎన్టీఆర్‌కు వినిపించగా.. కథ వింటుండగా బోయపాటి శ్రీను చెప్పే విధానంలో వైలెన్స్ ఎక్కువగా అనిపించిందట. దీంతో ఎన్టీఆర్ సైతం ఈ సినిమాను చేయలేనని నో చెప్పేశాడు. అలా.. ఎన్టీఆర్ కూడా భద్రా సినిమాను మిస్ చేసుకున్నాడు. కథను ఇద్దరు రిజెక్ట్ చేయడంతో.. చేసేదేమీ లేక అప్పటికే కాస్త పరిచయం ఉన్న మాస్ మహారాజ్ దగ్గరకు వెళ్ళాడు బోయపాటి.
ఇక బోయపాటి కథను విన్న రవితేజ కథ నచ్చేయడంతో వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా 2005లో రిలీజ్ అయిన భద్ర సినిమా ఆయన కెరీర్ లోనే ఓ మైల్డ్ స్టోన్గా నిలిచిపోయింది. బాక్సాఫీస్ దగ్గర బాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. యాక్షన్స్, సెంటిమెంట్, మాస్ అన్నింటిని సమపాళ్లల్లో చూపించిన ఈ సినిమా.. ప్రేక్షకులను మెప్పించింది. హీరోయిన్గా మీరా జస్మిన్ నటించగా.. కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ మెరిశాడు. డిఎస్పి మ్యూజిక్ సినిమాకు హైలైట్. ఈ సినిమాల్లో ప్రతి సాంగ్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాతో బోయపాటి తననైన ముద్ర వేసుకున్నాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత బోయపాటికి కూడా స్టార్ హీరోల సినిమాలు రూపొందించే అవకాశాలు దక్కాయి. మాస్ సినిమాల డైరెక్టర్గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం బోయపాటి బాలయ్యతో అఖండ 2 రూపొందిస్తు బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇక సెప్టెంబర్ లో దసరా కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది.