పవన్ కు లైన్ క్లియర్.. జూలైలో వీరమల్లు గ్రాండ్ ఎంట్రీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ స్టార్ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న పవన్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా విధులు నిర్వర్తిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తను సైన్ చేసిన సినిమాలను సైతం పూర్తి చేస్తూ వస్తున్నాడు. అలా పవర్ నటించిన యాక్షన్ పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లు.. తాజాగా షూట్‌ను పూర్తి చేసుకుని థియేటర్లో సందడి చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే.

అయితే అప్ప‌టికే 12సార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ మూవీ జులై 12న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడటంతో ఫ్యాన్స్ నిరాశ వ్య‌క్తం చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. గ్రాఫిక్స్ పని పూర్తి కాకపోవడం, థియేట్రికల్ బిజినెస్ జరగకపోవడంతో.. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న ప్రొడ్యూస‌ర్‌.. ఏ.ఏం. రత్నం వీరమల్లును మరోసారి వాయిదా వేశారు.

ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అంతా అప్పటినుంచి సరికొత్త రిలీజ్ డేట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక.. ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెర‌ప‌డింది. పవన్ కళ్యాణ్ లైన్ క్లియర్ అయింది. జూలై 25న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఫిక్స్ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే త్వరలోనే సినిమా ట్రైలర్ను రిలీజ్ చేయనున్నారట‌ మేకర్స్. ఇందులోనే రిలీజ్ డేట్ ని కూడా యాడ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.