టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్.. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై తెరకెక్కిన తాజా మూవీ కోర్ట్. ప్రియదర్శి, శివాజీ, హర్ష రోషన్, శ్రీదేవి ఆపల్ల కీలకపాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రీమియర్ షోస్ రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమా ఆడియన్స్ను ఆకట్టుకుందో లేదో రివ్యూలో చూద్దాం.
కథ:
చందు (రోషన్) ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేశాడు. తండ్రి వాచ్మెన్, తల్లి ఐరన్ షాప్ చూసుకుంటూ ఉంటుంది. ఇక చందు చదువు మధ్యలోనే ఆపేసి.. రోజుకో పని చేసుకుంటూ బతుకుతాడు. ఈ క్రమంలో జాబిల్లిని కలవడం.. ఫోన్ కాల్ ద్వారా వీరిద్దరి మధ్య ఏర్సడిన పరిచయం కాస్త ప్రేమగా మారడం.. ఇద్దరు ప్రేమని ఒకరితో ఒకరు చెప్పుకోవడమే కాదు.. కలిసి తిరుగుతూ ఉండడం.. జాబిల్లి, చందు ఇంటికి కూడా వస్తూపోతూ ఉండడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే విషయం జాబిల్లి భావ.. మంగాపతి (శివాజీ)కి తెలిసిపోతుంది. ఇక మంగాపతి.. పరువు, ప్రతిష్ట, పెద్ద కులం అనే అహం చూపిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే విషయం తెలుసుకుని చందు పై ఫోక్స్ కేసు పెట్టి ఇరికిస్తాడు. శ్రీదేవి కుటుంబాన్ని కూడా శాసిస్తూ ఉంటాడు.
ఇంట్లో అతను చెప్పిందే వేదం. దీంతో జాబిల్లితో పాటు.. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ కేసు విషయంలో నోరు మెదపలేకపోతారు. చందు పై ఫోక్స్ తో పాటు ఇంకా తప్పుడు కేసులు చాలా పెట్టి శిక్ష పడేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మంగపతి. ఇందులో భాగంగానే పోలీస్ స్టేషన్ తో పాటు లాయర్స్ అందరిని డబ్బు పరపతి వాడి కొనేస్తాడు. దీంతో చందు తరుపున కేసు వాదించేందుకు ఎవరు ముందుకు రారు. చందు తరుపున వాదించడానికి ఒప్పుకున్న లాయర్ కూడా మంగాపతికి అమ్ముడు పోవడంతో.. చందునే నేరస్థుడని ఆల్మోస్ట్ తీర్పు ఫిక్స్ అవుతుంది. సోమవారం ఫైనల్ తీర్పు అనే టైం కి లాయర్ మోహన్ రావు (సాయికుమార్) గురించి చందు ఫ్రెండ్స్ కి తెలుస్తుంది.
చివరి ప్రయత్నంగా మోహన్ రావుని కలుద్దామని.. చందు ఫ్యామిలీ తరఫున ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్తారు. అక్కడ జూనియర్ లాయర్ తేజ (ప్రియదర్శిని) కలుస్తారు. కేసు గురించి చెప్పి వాదించేందుకు అడగగా.. మోహన్ రావు కూడా దానిని రిజెక్ట్ చేస్తాడు. దీంతో అంతా అయిపోయింది.. చందుకి శిక్ష పడడం కాయం అనే పరిస్థితిలో అసలు ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి.. తర్వాత కథ ఎలా మారింది.. ఈ కేసులోకి జూ.లాయర్ తేజ ఎలా వెళ్ళాడు.. ఎందుకు వెళ్ళాడు.. ఆయన ఒప్పుకోవడంతో కథలో ఎలాంటి ట్విస్ట్‌లు వచ్చాయి.. ఎలాంటి వాదనలు వచ్చాయి.. ఇక అపొనెంట్ లాయర్‌ని తేజ ఎలా ఆడుకున్నాడు.. ఈ కేసులో ఆయన బయటకు తీసిన నిజాలు.. ఫైనల్ కేస్ రిజల్ట్.. కోర్ట్ వాదోపవాదాలు ఎలా జరిగాయి అన్నది సినిమాలో చూడాల్సిందే.
విశ్లేషణ:
సినిమాలో మెయిన్ కథనం.. అలాగే టీనేజ్‌లో పుట్టే తొలిప్రేమ తాలూకా కష్ట,నష్టాలన్నింటిని కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ఇక పేదవాళ్లకు న్యాయం జరగడం అంటే.. ఈ రోజుల్లో కోర్టులో ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాలని కోణాన్ని వాటి మధ్య మంగాపతి లాంటి ఒక బలమైన పాత్ర సృష్టించి మధ్యలో జరిగే సంఘర్షణలను కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు. మొత్తంగా ఈ కోర్ట్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక ఈ సినిమాకు శివాజీ యాక్టింగ్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. మంగపతి పాత్రలో శివాజీ ఆకట్టుకున్నాడు. ఇక లాయర్ సూర్య తేజ పాత్రలో ప్రియదర్శి జీవించేసాడు. రియల్ ఎస్టేట్ పర్ఫామెన్స్ తో మెప్పించాడు.
కుర్రాడి పాత్రలో నటించిన హర్ష రోషన్ తనదైన స్టైల్ లో నటనతో ఆడియన్స్‌ను ఫీదా చేసాడు. కొడుకు కోసం నిస్సహాయ స్థితిలో ఉండే పేరెంట్స్‌గా చందు పేరెంట్స్ పాత్రలో నటించిన నటినటులు కూడా ఆకట్టుకున్నారు. ఎమోషన్స్ ను చూపించే విధానం ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుంది. ఇక హీరో తల్లి పాత్రలో నటి రోహిణి మెప్పించింది. కోర్టు హాలు సీన్స్ సినిమాకు గ్రిప్పింగ్‌గా నిలిచాయి. సినిమాలో నటించిన ప్రతి నటీనటులు రియలిస్టిక్ పెర్ఫార్మన్స్‌తో మెప్పించారు. ముఖ్యంగా డైరెక్టర్ రామ జగదీష్ రాసుకున్న కోర్ట్ ఎపిసోడ్ చూసే సమయంలో ఆడియన్స్ ఎమోషనల్ అవ్వడం పక్కా అనిపించేలా తీర్చిదిద్దారు.
కుటుంబాల మధ్య సెంటిమెంట్ ఆకట్టుకుంటుంది. టీనేజ్ ప్రేమ దృష్టిలో పెట్టుకుని సినిమాను చాలా క్రియేటివ్ కంటెంట్ తో తెరకెక్కించాడు. ప్రేమ సీన్స్ కూడా మెప్పించాయి. శివాజీ టైమింగ్ సినిమాకు ప్లస్ అయింది. అయితే కోర్ట్ సినిమాలో మంచి మెసేజ్ ఉన్న కొన్ని సీన్స్ లాగ్ కనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని ఎపిసోడ్స్ సగానికి కుదించి ఉంటే బాగుండేది అన్న ఫీల్ వస్తుంది. రెగ్యులర్ కోర్ట్ స్టోరీ ట్రీట్మెంట్ తోనే సినిమాని నడపడం. శివాజీ పోషించిన మంగపతి క్యారెక్టర్.. మొదట చూపించినంత బలంగా ముగించలేకపోవడం మైనస్ గా మారింది.
టెక్నికల్ గా:
సినిమాలో చెప్పాలనుకున్న కాన్సెప్ట్ మరియు మెసేజ్ ఆకట్టుకుంది. స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గాని అందించిన సంగీతం ఆడియన్స్ కు నచ్చుతుంది. సినిమాటోగ్రఫీ తీరు లొకేషన్స్ అన్నీ నేచురల్ విజువల్స్‌లా కనిపించాయి. ఎడిటింగ్ మెప్పిస్తుంది. ఇక మంచి నిర్మాణ విలువలు ఉన్న సినిమా.
ఫైనల్ గా:
కోర్టు చూడదగ్గ కథ. మెయిన్ కాన్సెప్ట్ తో పాటు ఫోకస్ కి సంబంధించిన మంచి మెసేజ్ కూడా వస్తుంది. కచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
రేటింగ్ :3.5/5