అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ అందుకొని ఇంటర్నేషనల్ లెవెల్ ఇమేజ్‌తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో డైరెక్టర్ సుకుమార్ బన్నీని పూర్తి మాస్ యాక్షన్ పర్సన్‌గా చూపించాడు. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఏకంగా రూ.1800 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డుల వర్షం కురిపించింది. ఇక ఇప్పుడు బన్నీ నెక్స్ట్ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు పిక్స్ లెవెల్‌లో ఉన్నాయి. ఈ క్రమంలోనే బన్నీ కూడా తన కోసం సిద్ధమవుతున్నాడు. తమిళ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో బన్నీ నెక్స్ట్ సినిమా ఉండబోతుందని టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే సినిమాపై రోజుకో వార్త వైరల్గా మారుతుంది.
అలా తాజాగా వినిపిస్తున్న ఓ వార్త విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేసేందుకు సన్నధాలు జరుగుతున్నాయని సమాచారం. అయితే ఈ సినిమా కోసం డైరెక్టర్ అట్లి ఏకంగా రూ.100 కోట్ల భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. దీంతో నిర్మాణ సంస్థ వెనకడుగు వేసే అవకాశం ఉందని సినీ సర్కిల్‌లో వార్త చెక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా ఎవరు ప్రొడ్యూస్ చేస్తారని అయోమయం అందరిలోనూ మొదలైంది.
వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. బన్నీ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాకి ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్‌లో అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే అల్లు అర్జున్ కెరీర్‌లోనే మొట్టమొదటిసారి ఈ సినిమా కోసం డ్యూయల్ రోల్‌లో నటించబోతున్నాడని టాక్ నడుస్తుంది. ఇదే వాస్తవం అయితే.. సినిమాపై భారీ హైప్ నెలకొనడం ఖాయం. అల్లు అర్జున్, అట్లీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను బ్లాస్ట్ చేయడం పక్క అంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ రిలీజ్ బిజినెస్‌లతోనే పెట్టుబడులు తిరిగి వచ్చే అవకాశం ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.