సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మొదట నాగార్జునతో అనుకున్నారా.. కానీ..!

టాలీవుడ్ బిగ్గెస్ట్ ఎవర్ గ్రీన్ మల్టీ స్టార‌ర్ హిట్ సినిమాలలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఒకటి. 2013లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన సక్సెస్ అందుకుంది. అంతేకాదు.. తాజాగా ఈనెల 7న రీ రిలీజై అంతకు మించిన సక్సెస్ అందుకుంటుంది. ఈ క్రమంలోనే సినిమా రీ రిలీజ్ సక్సెస్ లో భాగంగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా కథను మొదట నాగార్జునకు చెప్పానని.. తర్వాత కొన్ని రోజులకు వెంకటేష్ సోదరుడు సురేష్ బాబుకు కలిసి వివరించాన‌ని.. నేను ఓ సారి మా ఊరు వెళ్తుంటే ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ గారు ఫోన్ చేసి నాగార్జున గారితో సినిమా చేయడానికి నీ దగ్గర ఏదైనా కథ ఉందా అని అడిగాన‌ని చెప్పుకొచ్చాడు.

అప్పటికి నేను కేవలం ఒక్క సినిమానే చేశా. అదే కొత్త బంగారులోకం. అది కూడా ఓ యంగ్ హీరోతో చేశా. అలాంటిది నాగార్జున లాంటి సీనియర్ స్టార్ కి కథ అనడంతో కాస్త టెన్షన్ గా ఫీల్ అయ్యా. ఓకే సార్ త్వరలో చెబుతా అని ఆయనకు రిప్లై ఇచ్చా. ఇద్దరు అన్నదమ్ములు నేపథ్యంలో చేస్తే బాగుంటుందని ఆలోచన మొదటి నుంచి నాకు ఉండేది. హైదరాబాద్ తిరిగి వచ్చాక నాగార్జున గారిని కలిసి అదే విషయం చెప్పా మల్టీ స్టార‌ర్ ఐడియా ఉంది సార్ ఇంకా పూర్తిగా స్క్రిప్ట్ రెడీ కాలేదని వివరించా. ఆయన చూద్దాం అన్నాడు. అదే టైంలో మళ్లీ మార్తాండ్‌ ఫోన్ చేసి నిర్మాత సురేష్ బాబు పిలుస్తున్నారు అని చెప్పారని.. ఆయన చెప్పినట్టే వెళ్లి కలిశానంటూ వివరించాడు.

Srikanth Addala - Wikipedia

అప్పుడు వెంకటేష్ కూడా ఉన్నారు. అప్పుడు కూడా నాగార్జున గారికి చెప్పిన సోదరుల కథని ఆయనకు వినిపించా. ఆ పాయింట్ వాళ్లకు బాగా నచ్చేసింది. కథ పూర్తి చేసుకుని రమ్మన్నారు. నా రెండో సినిమా కూడా దిల్ రాజు బ్యానర్‌లోనే చేయాలని నిర్ణయాన్ని చెప్పడంతో వాళ్ళు అంగీకరించారంటూ చెప్పుకొచ్చాడు. అలా వెంకటేష్‌తో ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చిందని శ్రీకాంత్ వివరించాడు. ప్రస్తుతం శ్రీకాంత్ చేసిన ఈ కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారడంతో.. ఒకవేళ నాగార్జున ఒప్పుకుని ఉంటే ఈ కథ ఆయన నటించేవాడు అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.