టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఏడుపదుల వయసు దగ్గరపడుతున్నా.. ఇప్పటికి వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చిరు హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా.. తన క్రేజ్ ను అంతకంతకు పెంచుకుంటూ పోతున్నారు. ఇక చివరిగా గాడ్ ఫాదర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దీంతో తన నెక్స్ట్ సినిమాతో హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు చిరు. ఈ క్రమంలోనే.. మల్లిడి వశిష్ట డైరెక్షన్‌లో విశ్వంభర సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. సోషియ ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన షూట్ ఆల్మోస్ట్ పూర్తయింది.
ఇక సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పటికే రిలీజ్ కావల్సిన ఈ సినిమా.. పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది సమ్మర్ కానుకగా సినిమాను రిలీజ్ చేయనున్నారట మేకర్స్. కాగా.. ఈ సినిమా పనులు పూర్తికాకముందే.. కొత్త సినిమా అప్డేట్‌ను అందించాడు మెగాస్టార్. ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. అనిల్ రావిపూడితో తన నెక్స్ట్ సినిమా ఉండబోతుందని ఫుల్ ఆఫ్ కామెడి ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సమ్మర్‌లోనే సినిమా షూట్ ప్రారంభమవుతుందని.. పూర్తిస్థాయి వినోదాత్మక సినిమాగా ఉండబోతుందంటూ వెల్లడించాడు.
ఇక అనీల్ రావిపూడి లాంటి సక్సెస్‌ఫుల్ స్టార్ట్ డైరెక్టర్‌తో చిరు సినిమా అంటే.. ఆడియన్స్ లో ఎలాంటి అంచనాలు ఉంటాయో తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ వైరల్‌గా మారుతుంది. చిరంజీవి సినిమాలో డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడట అనిల్ రావిపూడి. ఇక అనీల్ కథలోని సన్నివేశాలు చెప్పిన క్రమంలో.. కడుపుబ్బ నవ్వుకున్నానని.. డైరెక్టర్ కోదండ రామిరెడ్డి తో పనిచేసే సమయంలో కలిగిన ఫీలింగ్ అనిల్ రావిపూడి కథ విన్నప్పుడు వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులను ఆకట్టుకుంటుందని.. మెగాస్టార్ వివరించాడు. ఇక మెగాస్టార్ డ్యూయల్ రోల్‌లో కనిపిస్తున్నాడని వార్త వైరల్ అవ్వడంతో.. ఆడియన్స్‌లో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే సినిమాతో చిరు బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.