హాలీవుడ్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్‌క్రియేట్ చేసుకున్న ధనుష్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదికి ఆయన నుంచి రెండు, మూడు సినిమాలు రిలీజై మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే డైరెక్టర్‌గాను తన సత్తా చాటుకుంటున్నాడు ధనుష్. అలా.. ఇప్పటికే ఆయన డైరెక్టర్‌గా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదటి రెండు సినిమాల్లో ఆయనే హీరోగా కనిపించగా.. మూడో సినిమాలో మేనల్లుడు పవిష్‌ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. తన డైరెక్షన్లో గత ఏడాది వచ్చిన రాయన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అందుకుంది. దాంతో తాజా సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఆయన డైరెక్షన్‌లో వచ్చిన మూడో సినిమాన్నే జాబిలమ్మ నీకు అంత కోపమా టైటిల్‌తో తెలుగులోను రిలీజ్ చేశారు. తమిళ్‌తో పాటు.. తెలుగు రాష్ట్రాలలోను ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇతర చిన్న సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాకు భారీ వసూళ్లు దక్కుతున్నాయని టాక్. ధనుష్ డైరెక్టర్‌గా మారి.. మరిన్ని మంచి సినిమాలు తెరకెక్కించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒక్క లవ్ స్టోరీని నాచురల్‌గా.. యూత్‌ను కనెక్ట్ చేసేలా ఇంత సింపుల్ వేలో తెరకెక్కించవచ్చా అని సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయేలా.. ధనుష్ సినిమాలు తెరకెక్కించాడు. ఇక రాయన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ధనుష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.
టాలీవుడ్ హీరోలో మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటూ ధనుష్ ను ఈవెంట్లో యాంకర్ ప్రశ్నించగా.. ధనుష్ రియాక్ట్ అవుతూ తనకు టాలీవుడ్ సినిమాలు అన్నీ ఇష్టమేనని.. అలాగే తెలుగులో చాలామంది హీరోలు అంటే తనకు నచ్చుతుందంటూ వివరించాడు. ఇక నాకు టాలీవుడ్ లో ఎవరంటే ఇష్టమో చెబుతాను కానీ.. హీరోలు ఫ్యాన్స్ నన్ను దయచేసి ట్రోల్ చేయొద్దంటూ వెల్లడించాడు. తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని ధనుష్ ఇంటర్వ్యూలో వివరించాడు. ఇక హీరోగా వరస సక్సెస్లు అందుకుంటానే.. డైరెక్టర్‌గాను సత్తా చాటుతున్న ధనుష్ లాంటి స్టార్ హీరో.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నా ఫేవరెట్ హీరో అంటూ చెప్పడంతో.. మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియో క్లిప్‌ను తెగ వైరల్ చేస్తున్నారు.