మహేష్‌తో సినిమాకు నో చెప్పిన టాలీవుడ్ హీరో.. రాజమౌళికి బిగ్ షాక్..!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి 29 షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక రాజమౌళి డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తుందంటే పాన్ ఇండియా లెవెల్‌లోనే కాదు.. నేషనల్ లెవెల్‌లో ఎలాంటి బజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా.. ఈ క్ర‌మంలోనే ప్రస్తుతం మహేష్ సినిమా షూట్‌ను శ‌ర‌వేగంగా ముందుకు తీసుకెళుతున్నాడు జక్కన్న. రీసెంట్‌గానే రాజమౌళి ఫ్యామిలీలో ఓ ఇంపార్టెంట్ పర్సన్ కోల్పోవడంతో.. పది రోజులు సినిమాకు బ్రేక్ ఇచ్చినా ఆయన.. అన్ని కార్యక్రమాలను దగ్గర ఉండి తానే చూసుకున్నాడని టాక్. ఇక తాజాగా సెట్లోకి అడుగుపెట్టి అల్యూమినియం ఫ్యాక్టరీలో.. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు షూట్ కంప్లీట్ చేశారట.

Gopichand With Mahesh Babu | Super Star Krishna Chinna Karma | Trivikram |  TT - YouTube

త్వరలోనే ఆఫ్రికా అడవుల్లో షూట్‌కు శ్రీకారం చుట్టునన్నార‌ట టీం. ఇలాంటి క్ర‌మంలో సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతుంది. రాజమౌళి డైరెక్షన్లో నటించే ఛాన్స్ వస్తే చాలని ఎంతో మంది స్టార్ హీరోలు సైతం ఎదురుచూస్తున్నారు. కానీ.. కొన్ని సందర్భాల్లో అలాంటి అవకాశాన్ని కూడా రిజెక్ట్ చేసే హీరోస్ ఉన్నారని.. తాజాగా ఓ టాలీవుడ్ హీరో నిరూపించాడు. ఆయన మరెవరో కాదు గోపీచంద్. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఫేమ్ క్రియేట్ చేసుకున్న గోపీచంద్.. హీరోగా, విల‌న్‌గా రెండు షేడ్స్‌లో తన సత్తా చాటుకున్నాడు. కెరీర్‌ మంచి స్థానానికి ఎదిగాడు. అయితే ఇటీవల కాలంలో గోపీచంద్ కు సరైన సక్సెస్ రావడం లేదు. హీరోగా ఆయన మరో మెట్టు ఎక్కుతాడు అన్న నమ్మకం త‌గ్గిపోతుంది.

ఈ క్రమంలోనే విలన్ షేడ్స్‌లో నటించి ఇండస్ట్రీలో కొనసాగుతాడని అంతా భావించారు. కానీ.. ఎంత పెద్ద సినిమాలోనైనా విలన్ షేడ్స్‌లో మాత్రం తాను చేయనని గోపీచంద్ ఫిక్స్ అయ్యాడట. రీసెంట్గా ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో ఓ నెగటివ్ పాత్ర కోసం గోపీచంద్ అయితే బాగుంటాడ‌ని రాజమౌళి భావించాడట. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్‌ అసలు చేయను.. పైగా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో నెగటివ్ షేడ్స్‌ అయితే.. మీరు చెయ్యను అది నా కెరీర్‌కు బాగా డామేజ్ అయ్యే ఛాన్స్ ఉందంటూ.. రాజమౌళి డైరెక్టర్ అయినా సరే.. సినిమాను రిజెక్ట్ చేశాడట గోపీచంద్. అయితే ఈ వార్తలో వాస్తవం ఏంతో తెలియదు గానీ.. గోపీచంద్ నిర్ణయానికి కొంతమంది ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే.. మరి కొంతమంది రాజమౌళి డైరెక్షన్లో సినిమా మిస్ చేసుకున్నందుకు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.