నిన్న బాబాయ్ తో.. నేడు అబ్బాయితో.. ఇరగదీస్తున్న క్రేజీ బ్యూటీ..!

నంద‌మూరి నట‌సింహం బాలకృష్ణ నుంచి తాజాగా.. బాబి కొల్లి డైరెక్షన్‌లో డాకు మహారాజ్ సినిమా తెర‌కెక్కి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున‌ సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఊర్వశి రౌతెల కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఆమె చేసిన దబిడి దిబిడే సాంగ్ ఏ రేంజ్ లో హైలైట్ అయిందో తెలిసిందే. ఇక ఈ సాంగ్ కొన్ని విమర్శలు వచ్చిన.. నేషనల్ , ఇంటర్నేషనల్ లెవెల్ లో ట్రెండ్ సెట్ చేసింది. యూట్యూబ్‌లో హైయెస్ట్ వ్యూస్ సాధించిన సాంగ్‌గా సంచలనం సృష్టించింది.

Daaku Maharaaj: Nandamuri Balakrishna Receives Flak For Dabidi Dibidi Song  Steps With Urvashi Rautela - Filmibeat

ఈ సినిమా తర్వాత ఊర్వశి రౌతెలకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు క్యూ క‌డుతున్నాయ‌ట‌. ఈ క్రమంలోనే ఇప్పటికి రెండు మూడు సినిమాలకు ఊర్వశి కమిటీ అయిందని తెలుస్తుంది. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెర‌కెక్కనున్న భారీ ప్రాజెక్టులను ఊర్వశి రౌతెల భాగం కానుందని తెలుస్తుంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్‌ హీరోయిన్గా మెరుస్తుండగా.. ఊర్వశి రౌతెల ఓ కీలక పాత్రలో కనిపించ‌నుందట. అంతేకాదు.. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో.. తారక్‌తో కలిసి చిందేయనుందని సమాచారం.

NTR's War 2 Look Unveiled - Telugu360

డాకు మహారాజులో బాలయ్యతో కలిసి.. దబిడి దిబిడే అంటూ హిట్ కొట్టిన ఊర్వశి.. ఇప్పుడు ఎన్టీఆర్‌తో ఏ రేంజ్‌లో మెరవనుందో.. అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌లో త‌ర‌కెక్క‌నున్న ఈ ప్రాజెక్టు పై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మలయాళ స్టార్ట్ టోవినో థామ‌స్.. ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో మెర‌వ‌నున్నాడు. ఇటీవల ఈ సినిమా షూట్ పూర్తికాగా.. దీనికి డ్రాగన్ టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెల నుంచి ఈ మూవీ ర‌గ్యుల‌ర్ షూట్‌లో తార‌క్ పాల్గొంటాడ‌ట. ఇక 2026 జనవరి 9న గ్రాండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఆడియన్స్‌ను పలకరించనుందని.. ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు.