గోవా పార్టీలో కీర్తి సందడి.. అమ్మడు వేసుకున్న డ్రెస్ కాస్ట్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!

స్టార్ హీరోయిన్గా కీర్తి సురేష్ ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో మహానటి సినిమాతో భారీ పాపులారిటీ ద‌క్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో నేషనల్ అవార్ దక్కించుకుంది. మ‌రోపక్క కోలీవుడ్‌లోను వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు.. తా.ఆగా బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బేబి జన్ సినిమాతో అక్కడ ఆడియన్స్‌కు ప‌రిచ‌య‌మ‌ డిజాస్టర్‌ను మూటగట్టుకుంది.

Keerthy Suresh dazzles at wedding reception, dances with husband Antony  Thattil - The Hindu

అయితే.. అమ్మడు బాలీవుడ్ లో ఇప్పటివరకు ఎన్నుడు లేనంత గ్లామర్ డోస్‌ను వలకబోసి కుర్రకారును ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే మరిన్ని అవకాశాలు తలుపుతట్టే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు వెల్లడించారు. ఇక ఓ వైపు సినీ ఇండస్ట్రీలో రాణిస్తూనే.. మరోవైపు పర్సనల్ లైఫ్‌లోను వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. డిసెంబర్‌లో చిన్ననాటి స్నేహితులు ఆంటోనీ తట్టిల్‌ను వివాహం చేసుకుని మ్యారీడ్ లైఫ్‌లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. బేబీ జాన్ సినిమా రిలీజ్ ప్రమోషన్స్‌లో బిజీగా గడపడంతో.. పెళ్లి సెలబ్రేషన్స్‌ను పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయింది.

Keerthy Suresh stuns in green as she dances the night away with Antony  Thattil; shares party photos - The Economic Times

ఈ క్రమంలోనే తాజాగా భర్తతో కలిసి గోవాలో గ్రాండ్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోస్ తెగ‌ వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈవెంట్లో అమ్మడి డ్రెస్ అందరికీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్ ధ‌రించిన డ్రెస్ కాస్ట్ తెలుసుకొని షాక్ అవుతారు జ‌నం. చూడడానికి ఎంతో సింపుల్ గా.. కనిపిస్తున్న ఈ డ్రెస్ కాస్ట్ ఏకంగా రూ. 2.50 లక్షలట. అయితే ఈ డ్రెస్‌ను రోహిత్ గాంధీ, రాహుల్ కన్నా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.