టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ వన్ గా రాణిస్తన్నాడు. ఆయన వారసత్వంతో మేఘ హీరోలుగా ఎంతో మంది అడుగుపెట్టి ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి తండ్రి కొణిదల వెంకట్రావు.. అడపాదడపా నాటకాలను ప్రదర్శించేవారు. పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేశారు. సినిమాలో రాణించాలని ఆయనకు మొదటి నుంచి ఉండేదట. కానీ.. అది సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే చిరంజీవికి ఉన్న ఆసక్తితో ఆయనను ప్రోత్సహించాడు వెంకటరావు. ఆయన సక్సెస్, స్టార్ స్టేటస్ ను దగ్గరుండి చూసిన వెంకటరావు.. చిరు, పవన్ కళ్యాణ్ అలాగే రామ్ చరణ్ స్టార్ హీరోలుగా ఎదగడానికి కూడా చూశారు.
అయితే చరణ్ ఓ సందర్భంగా తాత గురించి మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. మా తాతగారు చివరిగా చూసిన సినిమా కూడా నాదే అంటూ వెల్లడించాడు రామ్ చరణ్. చిరుత సినిమా థియేటర్లలో వెంకటరావు చూశారని.. ఆ తర్వాత ఆయన మరే సినిమా చూడలేదు అంటూ చెప్పుకొచ్చాడు. వీల్ చైర్‌లో ఉన్న సమయంలో మనవడిని వెండితెరపై చూసి తెగ మురిసిపోయాడట చిరంజీవి తండ్రి వెంకట్రావు. ఇక చరణ్ నానమ్మ గురించి ఆయన మాట్లాడుతూ.. తనకు సంబంధించిన అన్ని సినిమాలను ఇప్పుడు నానమ్మ చూస్తుందని.. అదే టైంలో మరో అదృష్టం ఏంటంటే.. నేను , నాన్న కలిసి నటించిన ఆచార్య సినిమా నానమ్మ చూసిందని.. కొడుకు, మనవళ్ళు ఇద్దరినీ ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం నానమ్మకు అందినట్టు వెల్లడించాడు.
ఇక నానమ్మకు చిలిపితనం ఉందని.. అమ్మ సురేఖని ఎప్పటికప్పుడు ఆటపట్టిస్తూ ఉంటుంది. నానమ్మ.. సురేఖ మావాడు చూడు ఎలా డ్యాన్స్ చేసాడు అని చిరు గురించి గొప్పలు చెప్తూ ఉంటుందని.. అలాంటి చిలిపి పనులు ఎప్పుడు చేస్తూ ఉంటుందని వెల్లడించాడు. ఓ సినిమాను నాన్న, నానమ్మ, నేను కలిపి చూస్తే చాలా ఎంజాయ్ చేస్తానని.. చెప్పుకొచ్చాడు. ఇక ఆచార్య రిలీజ్ టైం లో చరణ్ చేసిన ఈ కామెంట్స్ వీడియో ప్రస్తుతం మరోసారి వైరల్ గా మారుతుంది. ఇక ప్రస్తుతం చరణ్ ఆర్సి 16 షూట్ల బిజీగా గడుపుతున్నారు. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో క్రికెట్, రెజినింగ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రా్‌లో ఉత్తరాంధ్ర నేపథ్యంలో సినిమా రూపొందుతుందని సమాచారం. ఇందులో చరణ్ గుడ్డివాడిగా కనిపించనున్నాడట.