టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తన 29వ సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్‌లో రూ.1500 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కుతుంది. అమెజాన్ అడవుల బ్యాక్ డ్రాప్‌తో.. యాక్షన్ అడ్వెంచర్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయాలని పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబుకు సంబంధించి చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఓ విషయంలో మహేష్ బాబుకు సమానమైన హీరో మరొకరు లేరు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
మహిళల్లో ప్రిన్స్‌కు ఉన్న క్రేజ్ మరెవరికి ఉండదని.. అమ్మాయిలకు సూపర్ స్టార్, కలల రాకుమారుడు అంటూ చెప్పుకొచ్చాడు. హ్యాండ్సమ్ లుక్స్ విషయంలో తనకు తిరుగు ఉండదని.. అతని ఇష్టపడని మహిళలు ఉండరంటూ వివరించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా తన సినిమాలను ఇష్టంగా చూస్తారని.. ఇక నా భార్య.. మహేష్ బాబును తమ్ముడులా భావిస్తుందని.. ఒక నటుడిగా మహేష్ బాబుకు ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి.. 100 అడ్వాంటేజ్‌లు ఉన్నాయి అంటూ వివరించాడు. ఇక వ్యాపార రంగంలోనూ సూపర్ స్టార్ గా రాణిస్తూ ఉండడం అభినందనీయం. చిన్నతనంలో బొద్దుగా ఉండేవాడు.. తనని తాను మార్చుకోవడానికి తన లుక్ ను సన్నగా, స్లిమ్ గా చేసుకోవడానికి కేబీఆర్ పార్క్ లో విపరీతమైన రన్నింగ్ చేసేవాడని నాగబాబు వివరించాడు.
చూస్తూ చూస్తూ ఉండగానే స్లిమ్, హ్యాండ్సం లుక్ లోకి మారిపోయాడని.. దక్షిణాది సూపర్ స్టార్ గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడని.. ఇక దక్షిణాదిలో మహేష్ బాబుకు సమానమైన క్రేజ్ ఉన్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్ అని వీళ్ళిద్దరి సమానంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు మెగా బ్రదర్ నాగబాబు. ఇక ఓ మెగా పర్సన్.. మహేష్ బాబును ఇంతలా పొగడ్డంపై మహేష్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇక రాజమౌళితో మహేష్ సినిమా తర్వాత సూపర్ స్టార్.. పాన్ వరల్డ్ రేంజ్‌లో నెంబర్ వన్ హీరోగా మారిపోవడం కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.