చిత్ర పరిశ్రమలో చాలామంది నటీనటులు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన తర్వాత హీరోలుగా , హీరోయిన్స్ గా మారి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అకట్టుకుంటున్నారు .. మరికొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లి వేరే కెరీర్ను ఎంచుకున్నారు .. అయితే ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .. ఈ క్రమంలోనే ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ చక్కరలు కొడుతుంది. ఇంతకు పైన ఫోటోల కనిపిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తుపట్టారా ? ఆల్ టైం బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది ఆ నటి.. ప్రస్తుతం సినిమాల కు దూరంగా ఉంటున్నా చైల్డ్ ఆర్టిస్ట్ చాలా ఫేమస్ .. తన క్యూట్ నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది ఇంతకు ఆమె ఎవరంటే.
ఇక పైన ఫోటోలో ఉన్న నటిని గుర్తుపట్టడం కాస్త కష్టమే .. కానీ ఒక నిమిషం దీక్షనంగా చూస్తే ఆమె ఎవరో గుర్తుపట్టొచ్చు .. ఇంతకి ఆమె మరి ఎవరో కాదు .. నటరత్న నందమూరి తారకరామారావు నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ శ్రేష్ట .. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలో నటించింది .. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు , నటసింహ బాలకృష్ణ , రజనీకాంత్ సినిమాలోను ఈమె నటించింది .. ముఖ్యంగా సమరసింహారెడ్డి సినిమా లో బాలకృష్ణ చెల్లెలుగా ఈమె నటన అద్భుతం .. అలాగే రాఘవేంద్రరావు దర్శకత్వంలో సీనియర్ ఎన్టీఆర్ , మోహన్ బాబు కలిసి నటించిన్న మేజర్ చంద్రకాంత్ సినిమా కూడా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు .. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ మనవరాలుగా నటించారు శ్రేష్ట . అలాగే ఈ సినిమాలో మరో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచు మనోజ్ కూడా నటించారు.
ఇక ఇప్పుడు తాజాగా శ్రేష్టకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది . రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ మంచు మనోజ్ ను పెళ్లి చేసుకోవాలన్న ప్రపోజల్ కూడా వచ్చిందని చెప్పుకొచ్చింది .. అలాగే శ్రేష్ట మాట్లాడుతూ మోహన్ బాబు గారికి మనోజ్ కు నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని ఎంతో ఆశపడేవారు .. అలాగే మా అమ్మగారు మనోజ్ అమ్మగారు కజిన్స్ అవుతారు వాళ్ల ఊరు మా ఊరు పక్కపక్కనే.. వాళ్లకు మా పెళ్లి జరగాలని బాగా ఉండేది .. కానీ నేనే ఒప్పుకోలేదు నా రీజన్స్ నాకు ఉన్నాయని ఆమె చెప్పకు వచ్చింది. ప్రజెంట్ ఆమె అన్న మాటలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.