ఆ రెండు ఏరియాల్లో ‘ గేమ్ ఛేంజర్ ‘ పై ‘ పుష్ప 2 ‘ ప్రభావం.. భయపడుతున్న బయ్యర్స్.. !

సినీ ఇండస్ట్రీలో భారీ సినిమా రిలీజై బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అఏదుకుని రికార్డులు క్రియేట్ చేసిందంటే.. కచ్చితంగా దాని తర్వాత రిలీజ్ అయ్యే సినిమాపై ఆ సినిమా ప్రభావం పడుతుందన‌టంలో అతిశయోక్తి లేదు. దానికి కారణం.. వచ్చిన సినిమాకు అప్పటికే వందల్లో టికెట్ రేట్లకు ఖర్చుపెట్టి.. మరోసారి థియేటర్లోకి వెళ్లి అంతే రేంజ్‌లో డబ్బు ఖర్చు చేసి సినిమా చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తి చూపరు. ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం గేమ్ ఛేంజ‌ర్‌పై డిసెంబర్‌లో రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా ప్రభావం పడునుంద‌ట‌. పుష్ప 2 సినిమా రిలీజై ఎలాంటి ప్రభంజ‌నం సృష్టించిందో తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆరు కోట్ల మంది థియేటర్లకు వెళ్లి మరి ఈ సినిమాను వీక్షించారు. కొంతమంది ఆడియన్స్ రిపీటెడ్ గా ధియేటర్లకు వెళ్లి సినిమాను చూసిన వాళ్ళు ఉన్నారు.

అలాంటివారు మ‌రీ ఇంత త‌క్కువ గ్యాప్‌లో రిలీజ్ అయ్యే కొత్త సినిమాను ఎక్కువ ఖర్చు చేసి థియేటర్‌లో చూడడానికి ఆలోచిస్తూ ఉంటారు. అలా పుష్ప 2 రిలీజ్ అయిన నెలరోజుల వ్యవధితో.. రామ్ చరణ్ గేమ్ ఛేంజ‌ర్‌ రిలీజ్ కానుంది. మరో వారం రోజుల్లో.. ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై పుష్ప 2 ప్రభావం.. అది కూడా రెండు ముఖ్యమైన ప్రాంతాల్లో ఎక్కువగా ఉండబోతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో ఒకటి ఓవర్సీస్ కాగా.. మరోక‌టి నార్త్‌ అమెరికా. గేమ్ ఛేంజ‌ర్‌పై ఈ రెండు ప్రాంతాల్లో పుష్ప 2 ప్రభావం గట్టిగా ఉండబోతుందట. సినిమా 15 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ పశువులను కల్లగొట్టి ఇప్పటికీ సంచలనం సృష్టించింది. ఆ సినిమా ఒక్కొక్కరు 30 డాలర్లకు పైగా వెచ్చించి మరీ థియేటర్స్ లో వీక్షించారు.

గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా టికెట్ రేట్ కూడా ఇదే రేంజ్‌లో ఉండడంతో.. మళ్ళీ అంత ఖర్చు పెట్టి సినిమా చూడాలంటే ఫ్యాన్స్ అయితే కచ్చితంగా చూడడానికి వెళ్తారు. కానీ.. సాధారణ ఆడియన్స్ మాత్రం ఆలోచిస్తారు. ఇలాంటి క్రమంలో గేమ్ ఛేంజ‌ర్‌ నుంచి.. తాజాగా రిలీజైన‌ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో.. ప్రస్తుతం నార్త్ అమెరికన్ అడ్వాన్స్ బుకింగ్స్ పుంజుకుంటున్నాయి. కానీ.. పుష్ప 2, దేవర రేంజ్‌లో 2.8 మిలియన్ డాలర్ల ప్రీమియర్స్‌ నుంచి రావడం అయితే కష్టమే అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న అంచ‌నా ప్రకారం ఈ సినిమాకు కేవలం 1.5మిలియన్ డాలర్ల గ్రాస్ మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయట. అంటే దాదాపు 1.3 మిలియన్ డాలర్లు నష్టం పుష్ప 2 కారణంగా.. గేమ్ ఛేంజ‌ర్‌పై ప‌డ‌నుంద‌ని సమాచారం. నైజాం మార్కెట్ పై కూడా ఈ ప్రభావం ఉంటుందనే భయంతోనే బయ్యర్స్ హక్కులను భారీ రేటుకు కొనడానికి తడబడుతున్నారట. మరి అది ఎంతవరకు నిజమౌతుందో వేచి చూడాలి.