కమల్ హాసన్ తో బ్రేకప్ కారణం అదే.. హీరోయిన్ గౌతమి

సౌత్ ఇండియన్‌ స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న గౌతమికి తెలుగు ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోయిన్గా పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ రాణిస్తున్న ఈ అమ్మడు.. తెలుగు, తమిళ్ భాషలో ఎన్నో సినిమాలతో ఆకట్టుకుంది. ఇక గౌతమి సినీ కెరీర్ ఎంత సక్సెస్ ఫుల్‌గా రాణించిందో.. పర్సనల్ లైఫ్ లో అంతకంటే ఎక్కువ కష్టాలను అనుభవించింది. ఈ క్రమంలోనే.. లవ్ ఫెయిల్యూర్‌గా కూడా మిగిలింది. దానికి ప్రధాన కారణం.. తమిళ్ స్టార్ హీరో కమల్‌హ‌సన్. గతంలో.. కమలహాసన్, గౌతమి లివింగ్ రిలేషన్షిప్ ను కొనసాగించిన సంగతి అందరికీ తెలిసిందే.

Gautami: Left Kamal Haasan because of commitment issues, not Shruti

వీరిద్దరు సుమారు 13 ఏళ్ల పాటు రిలేషన్షిప్ లో ఉన్నారట‌. అయితే చివరికి 2016లో వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఇక వీళ్ళు విడిపోవడానికి గల కారణం ఇటీవల ఇంటర్వ్యూలో గౌతమి స్వయంగా వివరించింది. ఓ ఇంట‌ర్వ్యూలో భాగంగా.. యాంకర్ కమల్ హాసన్‌తో మీరు విడిపోవడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించగా.. గౌతమి దీనిపై రియాక్ట్ అయింది. కమల్ హాసన్‌తో నాది చాలా సెన్సిటివ్ రిలేషన్‌షిప్ అంటూ వెల్లడించింది. అయితే మేమిద్దరం విడిపోవడం కూడా ఒక సెన్సేషన్ బ్రేకప్ అంటూ చెప్పుకొచ్చిన ఆమె.. తమ రిలేషన్ లో వేరే వారెవరు కూడా ఎంట్రీ ఇవ్వలేదని.. ఒకవేళ అలా ఎవరైనా ఎంట్రీ ఇచ్చి విడిపోవడం అంటే.. అది అసలు రిలేషనే కాదంటూ చెప్పుకొచ్చింది.

Kamal Haasan breaks silence on split with Gautami, says his feeling aren't  important

ఒక రిలేషన్ అంటే లైన్ గా ఇద్దరు కలిసి నడవాలి. కానీ.. ఇద్దరు వ్యతిరేక మార్గాలను ఎంచుకొని ప్రయాణించడం మొదలుపెడితే.. అక్కడ ప్రేమ ఉండదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక వాళ్ళిద్దరి మధ్యన బ్రేకప్ కూడా చాలా చిన్న చిన్న కారణాల వల్ల జరిగిందంటూ వివరించిన ఆమె.. వాటివి అనుభ‌విస్తూ జీవితాంతం గడపలేనని చెప్పుకొచ్చింది. ఒకవేళ అలాగే బతికితే.. నేను ముగ్గురికి అన్యాయం చేసిన దానవుతానంటూ చెప్పుకొచ్చిన గౌతమి.. తన కూతురికి ఇలాగే బతకాలని పరోక్షంగా తెలియజేసిన దాన్ని అవుతానని.. మరొకటి తనని తాను మోసం చేసుకుంటున్నట్లు అవుతుందని తన జీవితాన్ని ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. అయితే ఎలాంటి బాధలు లేకుండా పీస్‌ఫుల్‌ లైఫ్ లీడ్‌ చేయాలని భావించానని చెప్పుకొచ్చింది. తన తల్లి నేర్పిన విషయాలకు పూర్తిగా అర్థం ఉండాలంటే.. ఇలాంటి బాధలను భరించకపోవడమే మంచిది అంటూ గౌతమి వివరించింది. ఈ కారణం వల్లే కమల్‌కు బ్రేకప్ చెప్పేసానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అయితే తాను సరైన డైరెక్షన్‌లో వెళ్తున్నానని వివరించింది. ఇటీవల రీ ఎంట్రీతో ప‌లు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. మరికొన్ని సినిమాల్లో బిజీగా గడుపుతుంది.