టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ప్రముఖులలో రెబల్ స్టార్ ప్రభాస్ మొదటి వరుసలో ఉంటారు. బాహుబలి సిరీస్‌తో ఆయన సృష్టించిన సంచలనం అలాంటిది. అప్పటివరకు పాన్ ఇండియా లెవెల్లో మన టాలీవుడ్ సినిమాల జోరు అసలు కనిపించలేదు. ఇక బాహుబలి నుంచి ఈ ట్రెండ్ ప్రారంభమైంది. ఇప్పుడు గ్లోబల్ రేంజ్‌కు ఎదిగింది. అయితే.. ఈ సినిమా షూటింగ్ క్రమంలో ప్రభాస్ పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు. జక్కన్న విజన్ గురించి తెలిసిందే. ఆయన ఏదైనా అనుకుంటే అది పర్ఫెక్ట్ గా వచ్చేంతవరకు అది ఎంత కష్టమైనా రీటెక్ చేయిస్తూనే ఉంటారు. ఆర్టిస్టులను పిండేస్తాడు. అలా ప్రభాస్, రానాని కూడా సినిమాకు తగ్గట్టుగా బాడీ షేప్స్ తొందరగా రావాలని ఎన్నో డైట్‌లు సజెస్ట్ చేస్తూ.. రాజమౌళి టార్చర్ చేసేసారట.
ఇద్దరు రాజమౌళి చెప్పినవి తూచా తప్పకుండా అనుసరించి ఆ డైట్ ని ఫాలో అయ్యేవారు. అలా ఇద్దరు సినిమా షూట్ టైంకి సినిమాకు తగ్గ షేప్స్ లోకి వచ్చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వీళ్ళిద్దరూ ఆ డైట్ ని ఫాలో అవ్వడం మానేయడంతో రానా ఎన్నో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే విదేశాలకు వెళ్లి మరి శాస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారు. పలు సినిమాల్లో అప్పుడప్పుడు మెరుస్తున్నా.. బాహుబలి తర్వాత రాణిస్తాడు అనుకున్న రానా.. ఊహించిన స్థాయిలో అయితే సినిమాల్లో నటించడం లేదు. కేవలం రాననే కాదు.. ప్రభాస్ కూడా ఈ డైట్ ని ఫాలో అయ్యి మానేయడం వల్ల.. ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ని ఫేస్ చేస్తున్నాడట.
ప్రతి ఏడాది ఆయన ఏదో ఒక సమయంలో విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకోవడం వెంటనే ఇండియాకు వచ్చి మళ్ళీ షూట్‌లలో పాల్గొనడం చేస్తున్నారు. ఇక బాగా గమనిస్తే ప్రభాస్ ముఖంలో కూడా ఎన్నో మార్పులు వచ్చేసాయి. ఒకప్పుడు ఉన్న గ్లో ఇప్పుడు బాగా తగ్గిపోయింది అంటూ అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రభాస్ టెంపరరీగా షూటింగ్స్ పనులకు బ్రేక్ ఇచ్చాడు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు ప్రభాస్ వెళ్లినట్లు సమాచారం. అయితే ప్రభాస్‌కు ఉన్నటువంటి అనారోగ్య సమస్య కారణంగా ఫ్యూచర్‌లో ఆయన సినిమాలపై కచ్చితంగా ప్రభావం పడే అవకాశాలు ఉందని.. తక్షణమే ఆయన ఈ సైడ్ ఎఫెక్ట్స్ లకు సరైన పరిష్కారాన్ని చూసుకుని ఇబ్బందులనుంచి బయట పడాలని భావిస్తున్నారు.