సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి అంటే ఎంత పెద్ద సీజనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి తమ సినిమాలను రిలీజ్ చేయాలని స్టార్ హీరోల నుంచి.. చిన్న చిన్న సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు ఆరాటపడుతుంటారు. కానీ.. చివరకు సంక్రాంతి బరిలో నాలుగు, ఐదు సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతాయి. ఎప్పటిలానే ఈసారి కూడా సంక్రాంతి బరిలో ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. అందులో సంక్రాంతికి మొట్టమొదట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానుంది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ రూపొందించిన ఈ సినిమా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫ్రీ రిలీజ్ వేడుకలకు ముస్తాబవుతున్న ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ నేడు ఏపీలో రాజమహేంద్రవరంలో గ్రాండ్గా జరగనుంది.
ఇక ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఇక ఇదే సినిమాతో పాటు.. నందమూరి నటసింహం బాలయ్య, బాబి కొల్లి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అమెరికాలో గ్రాండ్ లెవెల్లో జరగనుంది. ఇక మరో సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించింది. సంక్రాంతి రోజు ఈ సినిమాను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇక సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ ఒరేంజ్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ మూడు సినిమాల్లో ఓ కామన్ పాయింట్ ఉందని చాలామంది గమనించి ఉండరు.
గేమ్ ఛేంజర్, డాకుమహరాజ్, సంక్రాంతికి వస్తున్నాం ఈ మూడు సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటో ఒకసారి చూద్దాం. గేమ్ ఛేంజర్‌లో చరణ్.. ఐపీఎస్, ఐఏఎస్ పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇక డాకు మహారాజ్.. బాలయ్య ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని ప్రొడ్యూసర్ నాగ వంశీ, డైరెక్టర్ బాబి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇక.. వెంకటేష్ – సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో వెంకీ మామ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. ఈ విషయాన్ని ప్రారంభం రోజు మేకర్స్ వివరించారు. అంటే సంక్రాంతికి రాబోతున్న ఈ మూడు సినిమాల్లో హీరోలు ప్రభుత్వ అధికారులుగా.. అది కూడా పోలీస్ ఆఫీసర్ల ఐఏఎస్, ఐపీఎస్ పాత్రల్లో మెరువనున్నారు. ఇది నిజంగా యాధృచ్చికం అనడంలో సందేహం లేదు. మరి ఈ పాత్రలో ఎవరు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకొని సంక్రాంతి కింగ్‌గా నిలుస్తారో వేచి చూడాలి.