బాలయ్య హిట్ కొట్టాలంటే ఎన్ని కోట్లు రావాలి.. ” డాకు మహారాజ్ ” బిజినెస్ లెక్కలు ఇవే..

గాడ్ ఆఫ్ మసెస్‌గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న బాలయ్య ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూనే.. మాస్ యాక్షన్ కంటెంట్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య తాజాగా నటించిన మూవీ డాకు మహారాజ్. జనవరి 12న సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది. బాబి కొల్లి డైరెక్షన్‌లో సీతారా ఎంట‌ర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన బాలయ్య ఫస్ట్ లుక్‌, టీజర్ సాంగ్స్ ప్రేక్షకులను వేరే లెవెల్లో ఆకట్టుకున్నాయి.

Balakrishna : డాకూ మహరాజ్ గా బాలయ్య | Balayya as Daku Maharaj

ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. బాల‌య్య కెరీర్‌లో 109వ‌ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్ర‌గ్యా జైశ్వాల్‌, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. చాందిని చౌదరి, బాబి డియోల్‌ కీలక పాత్రలో మెరవనున్నారు. కాగా సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో.. సినిమాకు సంబంధించిన థియేట్రిక‌ల్ బిజినెస్ లెక్క‌లు వైర‌ల్‌గా మారుతున్నాయి. డాకు మహారాజ్ నైజాం ఏరియాలో రూ.18 కోట్లకు నిర్మాత.. పంపిణీదారుడు దిల్ రాజు కొనుగోలు చేయగా, ఏపీలో సీడెడ్ మినహా మిగతా ప్రాంతాలన్నీ కలిపి రూ.40 కోట్లకు హక్కులు అమ్ముడుపోయాయి.

NRIPage | Box Office | Movie News | 'NBK 109' New Film Title Revealed:  Daaku Maharaj

సీడెడ్‌లో రూ.16 కోట్లు, ఓవర్సీస్ లో రూ.4 కోట్లు.. మిగతా రాష్ట్రాల్లో కోటి రూపాయలు సినిమా హ‌క్కులను కొనుగోలు చేశారని తెలుస్తుంది. ఇలా భారీ టార్గెట్‌తో రంగంలోకి దిగాడు బాలయ్య. ఇక ఇన్సైడ్ వర్గాల నుంచి ఇప్పటికే సినిమా పై యావరేజ్ టాక్ వినిపిస్తుంది. ఇలాంటి క్రమంలో అన్ని అవాంతరాలు దాటుకుని బాలయ్య సక్సెస్ సాధించాలంటే కలెక్షన్ల పరంగా అన్ని ప్రాంతాలకు కలిపి రూ.80కోట్లకు పైగా కలెక్షన్లు కొలగొట్టాల్సి ఉంది. ఇక సినిమా రిలీజై ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో.. వేచి చూడాలి.