మెగా ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అంటూ.. కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూసిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో జనవరి 10న థియేటర్‌లోకి అడుగు పెట్టింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా.. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పించింది. చరణ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తుండడం.. ఈ సినిమాపై ఆసక్తి పెంచుతున్న మరో విషయం. అయితే ఇవే కాకుండా గేమ్ ఛేంజర్‌లో మరో ఇంటరెస్టింగ్ విషయం ఉందంటూ ఓ సర్ప్రైజ్ న్యూస్ వైరల్ గా మారింది. చరణ్ సినిమాలో డ్యూయల్ రోల్ కాదు.. ట్రిపుల్ రోల్ లో నటిస్తునట్లు తెలుస్తుంది. తన సినీ కెరీర్‌లో మగధీర, నాయక్ లాంటి సినిమాల్లో ఇప్పటికే డ్యూయల్ రోల్‌లో కనిపించిన చరణ్.. గేమ్ ఛేంజర్‌లో మొట్టమొదటిసారి ట్రిపుల్ రోల్‌లో కనిపించనున్నాడట.
ఈ సినిమాలో చరణ్ తండ్రి.. అలాగే తన ఇద్దరు కొడుకుల పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. స్వార్థం లేని ప్రజానాయకుడు తండ్రి అప్పన్న పాత్రలో.. అలాగే స్ట్రిక్ట్, నిజాయితీగల ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు రామ్ నందన్ పాత్రలో చరణ్ కనిపించనున్నట్లు ఇప్పటికే ట్రైలర్ ప్రమోషనల్ కంటెంట్‌తో మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. అయితే.. రామ్ నందన్‌కి కవల సోదరుడిగా మరో పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారి పాత్రలో చరణ్ కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇక ట్రైలర్‌లోను ప్రజానాయకుడిగా, ఐఏఎస్ అధికారిగా, ఐపీఎస్ అధికారిగా మూడు విధాలుగా చరణ్ కనిపించనున్న సంగతి తెలిసిందే.
దీన్ని బట్టి ఈ న్యూస్ వాస్తవం అయ్యి ఉండవచ్చు. అయితే ఈ సినిమాలో.. చరణ్ ఓ పాత్రలో నత్తి ఉన్న వ్యక్తిగా కనిపించనున్నాడట. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమాతో గేమ్ ఛేంజర్‌ను కంపేర్ చేస్తున్నారు నెటిజన్స్. ఎన్టీఆర్ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. వాటిలో పెద్ద అన్నయ్య జై పాత్రకు నత్తి ఉంటుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ నటనకు ప్రశంసాలు అందడమే కాదు.. సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి రికార్డు క్రియేట్ చేసింది. అలాంటి మ్యాజిక్ గేమ్ ఛేంజర్ చేస్తే చరణ్ రిపీట్ చేస్తాడేమో వేచి చూడాలి. కాగా ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, చరణ్ అభిమానులు.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ మాటల యుద్ధం జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గేమ్ ఛేంజర్ తర్వాత మరోసారి జై లవ కుశ రూల్స్ తో ఈ సినిమా పాత్రలను పోల్చి మాటల వార్ జరిపే అవకాశం ఉంది.