నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ పేరుకు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న బాలయ్య.. ఓ పక్కన హీరోగానే కాదు, పొలిటిషన్ గాను.. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగాను ఎందరినో ఆకట్టుకున్నాడు. ఇక ఆయన కోప్పడినా సరే కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ పై చేయి చేసుకున్న సరే.. అవేమి అభిమానులు పట్టించుకోరు. ఆయనపై ఏమాత్రం ప్రేమ తగ్గదు. అలాంటి బాలయ్య ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో అన్‌స్టాపబుల్‌షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్యకు సంబంధించిన వార్త నెటింట తెగ ట్రెండిగా మారింది. తాజాగా బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు, రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే.
గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌లో భాగంగా మెగా పవర్ స్టార్ ఈవెంట్‌లో సందడి చేశాడు. నిజానికి చరణ్ ఎప్పటినుంచి తీసుకురావాలని అల్లు అర్జున్ ప్లాన్ చేసిన అది ఇప్పటికి వర్కౌట్ అయింది. ఈ క్రమంలోనే చరణ్ ఈ షోల మాట్లాడిన మాటల ప్రోమో నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. మెగా అభిమానులంతా బాలయ్య, చరణ్‌తో ప్రవర్తించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఆయన మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో చరణ్ నుంచి తెలుసుకోవాలనుకునే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలను చరణ్ నుంచి రాబట్టాడు. ఈ క్రమంలోనే రామ్‌చరణ్ నటించిన సినిమాల్లో బాలయ్య మోస్ట్ ఫేవరెట్ సినిమా ఏది అనే విషయాన్ని కూడా రివీల్ చేశాడు. బాలయ్య మాట్లాడుతూ.. రామ్ చరణ్ నటించిన ‘ మగధీర ‘ సినిమా అంటే తనకు చాలా చాలా ఇష్టమని.. ఇప్పటికే దాదాపు 100 సార్లు పైగానే చూశాను అంటూ చెప్పుకొచ్చాడు.
ఆ సినిమా ఎప్పుడు చూసినా ఎంజాయ్ చేస్తానని.. ముఖ్యంగా సినిమాల్లో చరణ్ హార్స్ రైడింగ్ మూమెంట్స్ తెగ నచ్చేస్తాయి అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం బాలయ్య చేసిన ఈ కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఇక తాజాగా గేమ్ ఛేంజర్ చేస్తారు. రిలీజ్ ఈవెంట్‌కు రాజమండ్రి వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చరణ్ హార్స్ రైడింగ్ చూస్తే నాకు అసూయ కలుగుతుంది అని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇక చరణ్ నుంచి జనవరి 10న రానున్న గేమ్స్ ఛేంజర్ సినిమాలోని చరణ్ హార్స్ రైడింగ్ సీన్స్ ఆడియన్స్‌కు కనిపించనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో స్టార్ హీరోలు చరణ్ హార్స్ రైడింగ్‌పై చేసిన కామెంట్స్ సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. ఇక సినిమా ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.