ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ సినిమాలతో ముస్తాభౌతున్న సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల విషయంలో తాజాగా ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారుతుంది. ప్రస్తుతం చరణ్ – గేమ్ ఛేంజర్, బాలయ్య – డాకు మహారాజ్, వెంకటేష్ – సంక్రాంతికి వస్తూనం సినిమాలతో సంక్రాంతి బరిలో పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే గత ఐదేళ్ల క్రితం ఈ ముగ్గురు స్టార్ హీరోస్ ఆడియన్స్‌ను పలకరించడానికి రెడీ అయ్యారు. అయితే అప్పట్లో బాలయ్య నుంచి ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా రిలీజ్ అయింది.
సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఇక చరణ్ నుంచి వినయ విధేయ రామ భారీ అంచనాల నడుమ తెరకెక్కి ఫ్లాప్‌గా నిలిచింది. కాగా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్‌గా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఎఫ్2 ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ రెండు సినిమాలను వెనక్కి నెట్టింది. ఇలాంటి క్రమంలోనే తాజాగా మరోసారి ముగ్గురు హీరోలు సంక్రాంతి బరిలో పోటీకి సిద్ధమవుతున్నారు.
కాగా.. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ అవ్వడంతో ఈసారి బాలయ్య డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తో బ్లాక్ బస్టర్లు కొట్టి.. వెంకీ పై రివెంజ్ తీర్చుకుంటారా లేదా అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఓ పక్కన బాలయ్య అభిమానులు, మరో పక్కన చరణ్ అభిమానులు సంక్రాంతి బరిలో మా హీరో సినిమా బ్లాక్ బస్టర్ అంటే.. మా హీరో సినిమా బ్లాక్ బస్టర్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక వెంకీ మామ.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై కూడా ఆడియన్స్ లో అదే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రాబోయే మూడు సినిమాలలో సంక్రాంతి కింగ్ గా ఎవరు నిలుస్తారో చూడాలని ఆసక్తి టాలీవుడ్ అంతట నెలకొంది.