టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాడ్ ఆఫ్ మాసేస్‌గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బాలయ్య.. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో హ్యాట్రిక్ అందుకుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. బాలయ్య ప్రస్తుతం డాకు మహారాజు సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసారు మేకర్స్. ఈ క్రమంలోనే.. బాలయ్య పెద్ద కూతురు నారా బ్రాహ్మణికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.
దాదాపు తెలుగు ప్రేక్షకులకు నారా బ్రాహ్మణి గురించి కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కాగా నారా బ్రాహ్మణి తెలుగు ఫేవరెట్ హీరో ఎవరు అనే అంశం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బ్రహ్మణి చాలా ట్రెడిషనల్ గా ఉంటారు. అంతేకాదు.. చాలా సింప్లిసిటీ మైంటైన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆమెను అందరూ ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా నారా బ్రాహ్మణి అందరి మనసులు తన మాట తీరుతో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే బ్రాహ్మణిని హీరోయిన్గా నటింపజేయాలని ఇండస్ట్రీలో చాలామంది ప్రయత్నించారు.
కానీ బాలయ్య దానికి ఒప్పుకోకపోవడంతో.. బ్రహ్మణి హీరోయిన్ కాలేదట. అయితే బ్రాహ్మణికి సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టమట. ముఖ్యంగా బాలయ్య నటించే సినిమాలు ఆమె ఒక్కటి కూడా మిస్ కాకుండా చూస్తుందట. అయితే బాలయ్య తర్వాత అంతగా బ్రాహ్మణి ఇష్టపడే సినిమాలు.. ఒక్క సినిమా కూడా మిస్ కాకుండా చూసేవి మెగాస్టార్ చిరంజీవి సినిమాలే నట. అంతేకాదు ఇటీవల కాలంలో ఆమె ఫేవరెట్ హీరోగా రామ్ చరణ్ కూడా మారిపోయాడంటూ వైరల్ అవుతుంది. ఆయన నటించే సినిమాలను కూడా బ్రహ్మని చాలా ఇష్టపడుతుందట. రామ్ చరణ్ నటన, యాక్టింగ్ స్కిల్స్ బ్రాహ్మణికి బాగా నచ్చుతాయని.. ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.