చిరు కారణంగా ఎన్టీఆర్ కి ఫ్లాప్.. డైరెక్టర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. స్వయంకృషితో సక్సెస్ సాధించిన వారిలో మొదట మెగాస్టార్ పేరే వినిపిస్తుంది. కెరీర్ ప్రారంభంలో.. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న చిరంజీవి.. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే.. విలన్ పాత్రలో, తర్వాత హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే తన నటనతో సత్తా చాటుకుంటూ స్టార్ హీరోగా మెగాస్టార్ రేంజ్‌కు ఎదిగాడు. ఇప్పుడు కూడా అదే ఇమేజ్ను కంటిన్యూ చేస్తున్న చిరు.. తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్నాడు.

Watch Andhrawala (Telugu) Full Movie Online | Sun NXT

అయితే ఆయన సినీ కెరీర్‌లో ఎన్నో మంచి కథలను కూడా వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. అలా.. వదులుకున్న సినిమాలలో కొన్ని బ్లాక్ బస్టర్ కాగా.. మరికొన్ని డిజాస్టర్లుగా నిలిచాయి. ఇకపోతే.. చిరంజీవి ఓ సినిమా కాదని రిజెక్ట్ చేయడంతో.. తారక్ దానికి గ్రీన్ సెగ్నల్ ఇచ్చి నటించాడట. అయితే అది బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినట్లు సమాచారం. ఇంతకీ ఆ మూవీ ఏంటో ఒకసారి చూద్దాం.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఆంధ్రావాలా వ‌చ్చిన‌ సంగతి తెలిసిందే.

Jr NTR and Megastar Chiranjeevi are on same stage!

విపరీతమైన అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా.. ఘోర‌ డిజాస్టర్‌గా నిలిచింది. ఎన్టీఆర్‌కు భారీ ఫ్లాప్ తెచ్చి పెట్టింది. అయితే.. మొదట పూరి జగన్నాథ్ ఈ సినిమాను మెగాస్టార్ కోసం అని రాసుకున్నాడట. అందులో భాగంగా చిరంజీవిని కలిసి కథ వినిపించగా.. చిరంజీవి స్టోరీ నచ్చకపోవడంతో దాన్ని రిజెక్ట్ చేశాడని.. అయితే పూరి జగన్నాథ్ మాత్రం తన కథపై ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో కథను ఎన్టీఆర్‌కు చెప్పగా ఎన్టీఆర్ ఆ క‌థ‌ను ఒప్పుకొని సినిమా చేశాడు. ఇక సినిమా ఘోర పరజయాన్ని సొంతం చేసుకుంది.