స్టార్ హీరోలకు.. నైజం సినిమాల కలెక్షన్లు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక యంగ్ టైగర్ఎన్టీఆర్ కు అక్కడ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్‌కు ముందే భారీ లెవెల్ బిజినెస్ జరుపుకుంది. నైజంలో టాప్ 5 సినిమాల్లో దేవర చోటు దక్కింకుని రికార్డ్ సృష్టించింది. ప్రసతుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బిజినెస్ లెక్కల్లో ఎన్టీఆర్ వేరే లెవెల్ అంటూ.. కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. నైజంలో బిజినెస్ విషయంలో ఆర్‌ఆర్ఆర్ మొదటి పొజిషన్‌లో ఉంది. ఇక ఈ సినిమాకు ఏకంగా రూ.70 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఈ సినిమా తర్వాత కల్కి అత్యధిక కలెక్షన్లను రాబట్టి రూ.65 కోట్ల బిజినెస్ జరుపుకుంది.
సలార్ సినిమాకు రూ.60 కోట్లు.. ఆది పురుష్‌కు యాభై కోట్ల రేంజ్‌లో వసూలు దక్కాయి. ఇక ఈ నాలుగు సినిమాల తర్వాత బిజినెస్ పరంగా రూ.44 కోట్టతో దేవర సినిమా 5వ స్థానంలో ఉండడం గమనారం. ఇక రిలీజై.. వచ్చే రిజల్ట్ బట్టి కలెక్షన్ల విషయంలో మరోసారి దేవర దుమ్ము దులపడం ఖాయం అంటూ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక నైజాం.. దేవర తర్వాత గుంటూరు కారం, బాహుబలి 2, సాహు, ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలు ఆ లిస్టులో ఉన్నాయి. ఇక నైజంలోనే కాదు.. మిగతా ప్రాంతాల్లోనూ దేవర రిలీజ్ తర్వాత మరిన్ని సంచలన రికార్డులను క్రియేట్ చేయాలంటూ అభిమానులు భావిస్తున్నారు. దేవర 1 సినిమా బిజినెస్ విషయంలో ఫ్యాన్స్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఏకంగా రూ.180 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో.. దేవర భారీ లెవెల్ బిజినస్ జరిపిన సినిమాల లిస్టులో చేరిపోయింది.
దేవర సినిమా రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని మొదట అనుకోలేదట. కానీ స్క్రిప్ డిమాండ్ కారణంగా.. సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించనునట్లు గతంలో మేకర్స్ వివరించారు. ఇక మొదటి భాగానికే సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఈ లెవెల్ లో ఉంటే.. ఈ సినిమా రిలీజ్ బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకుంటే.. పార్ట్ 2 పై అభిమానుల్లో మరింత అంచనాలు పెరుగుతాయి.. ఇంకెన్నా సరికొత్త రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తారక్ ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ.. సంచలన రికార్డులు క్రియేట్ చేస్తాడంటూ.. నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రీమియర్ షో ఆడియన్స్‌ను పలకరించనుంది. సినిమా రిలీజై.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ఎలాంటి సంచలన రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.