సగటు ప్రేక్షకుడి సినిమాలపై ఎలాంటి అభిమానం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కారణం ఇండియాలోనే ఎంటర్టైన్మెంట్ కి ఉన్న మొటమొదటి మార్గం సినిమా కావడం. రాజకీయాల తర్వాత సోషల్ మీడియా మాధ్యమంగా కూడా ఎక్కువగా జనాలు మాట్లాడుకునే టాపిక్ సినిమానే. ఈ క్రమంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో నేడు అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తెరకెక్కి సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇక రెండు దశాబ్దాల కిందటి వరకు తెలుగు భాష.. సినిమా ఒకటి ఉంది అనే విషయం బయట ప్రపంచానికి తెలిసేది కాదు. అలాంటిది దర్శకధీరుడు రాజమౌళి చలవతో బాహుబలి సినిమా గ్లోబల్ స్థాయిలో తెరకెక్కి సక్సెస్ అందుకోవడంతో.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా కీర్తి రెట్టింపు అయింది.
అయితే ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి ఏంటి అనేది చర్చ కాదు. సినిమా హీరోలు, దర్శకులు. ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారంటే ప్రొడ్యూసర్లు కేవలం హీరోల ముఖం చూసి దర్శకుల టాలెంట్ చూసి సినిమాను తెరకెక్కించడానికి ముందుకు వేస్తున్నారు. అలాంటి సమయంలో దర్శకులు ఈ సినిమా విషయంపై బాధ్యత వహించాల్సి ఉంటుంది. కేవలం హీరోనే హైలైట్ చేసి.. కదా స్క్రీన్ ప్లే పక్కకు తోసేస్తే నిర్మాతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితులను మన తెలుగు పరిశ్రమలో అనేక మంది ఎదుర్కొన్నారు. అయితే ఓ సినిమా రిలీజ్ అయ్యే వరకు దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఎవ్వరికి తెలియదు.
ఈ క్రమంలోనే సినిమా తెరకెక్కించిన తర్వాత కేవలం హీరో ఓవర్ యాక్షన్ కారణంగా ఫ్లాప్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. కథను పక్కన పెట్టేసి సినిమా అట్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఆ లిస్టులో హీరో రవితేజ ఖతర్నాక్ సినిమా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 2006లో వచ్చిన ఈ సినిమా కేవలం రవితేజ బిల్డప్ కారణంగా ఫ్లాప్ గా నిలిచిందంటూ.. ఈ మూవీలో కథేలేదంటూ ఎన్నో విమర్శలు తలెత్తాయి. కేవలం కథలేకుండా రవితేజ బిల్డప్ పైనే దర్శకులు ఫోకస్ చేశారంటూ నెగిటివ్ కామెంట్లు వెల్లువయ్యాయి. ఆదే కొవలో మరో సినిమా పవన్ కళ్యాణ్ బాలు పేరు కూడా వినిపిస్తుంది.
ఈ సినిమా కూడా కథ తక్కువ.. హీరో ఓవరాక్షన్ ఎక్కువ అన్న విమర్శలు ఎదురయ్యాయి. అలా మెగాస్టార్ సినిమాల్లో డిజాస్టర్ అయిన సినిమా అంజి కూడా అదే కోవలోకి వస్తుంది. ఇక ఎన్టీఆర్ ఆంధ్రవాలా, శక్తి కూడా అలా ఫ్లాప్ అయినవే అంటూ గతంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. అలాగే వెంకటేష్ హీరోగా నటించిన నాగవల్లి సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కథే లేదు.. కేవలం వెంకటేష్ ఓవరాక్షన్ తప్ప అంటూ విమర్శలు గొప్పమన్నాయి. ఇక రాంచరణ్ నటించిన సినిమాల్లో నాయక్ సినిమాలో కూడా కంటెంట్ వీక్‌గా.. కేవలం హీరో క్యారెక్టర్ హైలెట్ గా నిలిచేలా తెరకెక్కించారని.. అందుకే ఈ సినిమా ప్లాప్ అయ్యిందంటూ అప్పట్లో ఎన్నో కామెంట్లు వినిపించాయి.