దేవర సినిమా కోసం తారక్ అంత నొప్పిని భరించాడా.. వర్క్ డెడికేషన్ అంటే అదేగా..!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ అభిమానులను సంపాదించుకున్న తారక్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. అందులో మొదటి భాగం వచ్చే నెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానన్నారు మేకర్స్.

ఇక ఈ సినిమాలో దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. సైఫా అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. కాగా ఈ సినిమా రిలీజ్ కు కరెక్ట్ గా నెల రోజులు ఉండడంతో.. మూవీ టీమ్ అంతా చాలా స్పీడ్ గా పనులను పూర్తి చేయడంలో బిజీ అయ్యారు. ఇప్పటికే ఈ మూవీ టీం సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు మొదలెట్టేసారట. అందులో భాగంగా ఎన్టీఆర్ తో ప్రస్తుతం డబ్బింగ్ పనులు పూర్తి చేయిస్తున్నట్లు సమాచారం.

ఇకపోతే ఎన్టీఆర్ కి కొన్ని రోజుల క్రితమే చేతికి గాయమైన సంగతి తెలిసిందే. ఓ పక్కన నొప్పితో ఎన్టీఆర్ బాధపడుతూనే.. డబ్బింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. దానికి ప్రధాన కారణం ముందుగా హీరో డబ్బింగ్ పూర్తి అయితే.. ట్రైలర్ కట్ చేయడం.. రిలీజ్ చేయడానికి ఈజీ అవుతుందనే ఉద్దేశంతో ఎన్టీఆర్‌ను మేకర్స్ అడిగినట్లు.. తన చేతి గాయం మానకున్న.. నొప్పిని భరిస్తూనే ఈ సినిమా డబ్బింగ్ కు ఎన్టీఆర్ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంటే సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరుగుతాయి అనడంలో సందేహం లేదు.