సింగర్ నోయల్ మాజీ భార్య ఎస్తేర్ గురించి ఆడియన్స్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఈమెకు సంబంధించిన ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే నోయల్ కూడా ఓ సందర్భంలో బిగ్ బాస్ హౌస్ లో ఈ విషయంపై ఎమోషనల్ అయ్యాడు. అవన్నీ దొంగ ఏడుపులేనని.. అంత పబ్లిసిటీ కోసమే అంటూ ఎస్తేర్ వాటిపై రియాక్ట్ అయ్యింది. అంతేకాదు ఏ ఇంటర్వ్యూలో ఎస్తేర్ పాల్గొన్న డివోర్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. ఇప్పటికే ఆమె వారి డివోర్స్ పై ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చినా.. వారి సినిమా ప్రమోషన్స్ అప్పుడు కూడా ఇదే ప్రశ్నలు ఎదురవుతాయి. ఇక ఎస్తేర్ కూడా ఎన్నో యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా మరో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో నోయల్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఎస్తేర్.
2019 లో నోయేల్‌ను వివాహం చేసుకున్న ఈ అమ్మడు.. ఏడాది కూడా గడవక ముందే అతనికి డివోర్స్ ఇచ్చేసింది. పెళ్లయిన 16 రోజులకే నోయల్ నుంచి ఈమె విడిపోయినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అయితే తాజా ఇంటర్వ్యూలో నోయల్ గురించి ఎస్తేరు మాట్లాడుతూ.. చాలామందికి పెళ్లికి సంబంధించిన అన్ని పనులు పూర్తయి.. పెళ్లి రేపు జరుగుతుందనగా తన కాబోయే వ్యక్తి గురించి ఏదైనా విషయం బయటపడితే దానికి సంబంధించినవన్నీ పెళ్ళయ్యాక చూసుకుందాంలే.. తర్వాత మారతారని భావిస్తారు. కానీ.. పెళ్లయ్యాక కూడా అదే తంతు రిపీటెడ్‌గా కనిపిస్తే మళ్లీ వాళ్లతో రిలేషన్ షిప్ అనేది జరగదు. ఏదైనా తప్పు ఒకసారి అయితే తెలియక చేశారని క్షమించవచ్చు. కానీ.. క్షమిస్తున్నాము కదా అని ఒకటికి రెండు మూడు సార్లు అదే తప్పును చేస్తే వారి జీవితంలో మారారని అర్థం. ఎదుటి వ్యక్తితో వాళ్ళు గేమ్ ఆడుతున్నారని.. తెలుసుకోవాలి. ఈ విషయాన్ని నేను పెళ్లైన కొద్ది రోజులకే గమనించా.
కొంతమందిని క్షమిస్తే మారుతారు. కానీ వాళ్ళు మన క్షేమ గుణాన్ని బలహీనత చేసుకొని ఒకటికి రెండు మూడు సార్లు అదే తప్పు చేసి మనల్ని క్షమించమంటే వారు ఎప్పటికీ మారరు. అలాంటి వ్యక్తులు బయటకి చూడడానికి బాగానే ఉన్నా.. వారితో జీవించే వారికి.. వారి గురించి అసలు నిజం తెలుస్తుంది అంటూ ఎస్తేరు చెప్పుకొచ్చింది. నోయెల్‌తో విడాకుల గురించి ఎస్తేరు చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో.. ఓ భార్య ఇంతలా ఒకే తప్పని ఎన్నోసార్లు చేశాడని బాధపడుతుంది అంటే.. ఆమె నోయల్ వేరే అమ్మాయి అమ్మాయితో కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఉంటుంది. అదే తప్పును రిపీటెడ్ గా చేస్తున్నాడని బాధలోనే అతనికి విడాకులు ఇచ్చేసి ఉంటుంది. ఇంతలా డిప్రెషన్ లోకి వెళ్లి ఉంటుంది అంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.